ఇంటికో రూ.10 లక్షలు.. కేసీఆర్ వరాలివీ

హుజురాబాద్ లో రాజకీయ పోరు షురూ అయింది. పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ పలు తాయిలాలు ప్రకటిస్తుండగా బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర చేపడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ దళిత సాధికారత కోసం దళిత బంధు అనే పథకాన్ని హుజురాబాద్ లోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో ఓటర్లను ప్రభావితం చేసే పనిలో భాగంగానే చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో వంద దళిత కుటుంబాలను ఎంపిక చేసుకుని వారికి రూ.10 […]

Written By: Srinivas, Updated On : July 19, 2021 4:22 pm
Follow us on

హుజురాబాద్ లో రాజకీయ పోరు షురూ అయింది. పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ పలు తాయిలాలు ప్రకటిస్తుండగా బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర చేపడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ దళిత సాధికారత కోసం దళిత బంధు అనే పథకాన్ని హుజురాబాద్ లోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో ఓటర్లను ప్రభావితం చేసే పనిలో భాగంగానే చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో వంద దళిత కుటుంబాలను ఎంపిక చేసుకుని వారికి రూ.10 లక్షల చొప్పున నగదు సాయం చేసేందుకు నిర్ణయించారు. ఈ పథకాన్ని హుజురాబాద్ నుంచే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో వంద మందికి కాకుండా మొత్తం అందరికి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ మొత్తం ఆరు వేల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఓ వెయ్యి కుటుంబాలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా పరిగణించారు. ఇక ఐదు వేల కుటుంబాలకు సాయం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పథకం కోసం కేటాయించిన సొమ్ములో సగానికి పైగా వెచ్చించాల్సి ఉంటుంది.

అయినప్పటికి కేసీఆర్ వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. నియోజకవర్గంలో దళిత కుటుంబాలన్నింటిని లెక్కించి వారిలో అర్హుల్ని తేల్చడానికి ప్రత్యేకంగా వర్క్ షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దళిత బంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి పది లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రాష్టంలో 119 నియోజకవర్గాల నుంచి 11900 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయిస్తే నిధులు ఎక్కువ అవసరమయ్యే సూచనలున్నాయి.

హుజురాబాద్ పైలెట్ ప్రాజెక్టు అని ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా ఎన్నికలకు ముందే ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు పంపిణీ చేస్తే టీఆర్ఎస్ కు తిరుగుండదు. అయితే ఈ పథకాన్ని కేసీఆర్ మార్క్ లో అమలు చేస్తారని విపక్షాలు చెబుతున్నాయి. గ్రేటర్ లో వరదసాయం తరహాలో కొంత మందికి ఇచ్చి మిగతా వారికి ఎన్నికల కోడ్ పేరుతో ఆశ పెడతారని భావిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఏం చేసినా రాజకీయంగ చర్చనీయాంశమే అవుతుంది.