ఖాతాదారులకు శుభవార్త.. ఫ్రీగా రూ.7 లక్షల బెనిఫిట్..?

దేశంలో ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసేవాళ్లలో ఎక్కువమంది పీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నారు. దేశంలోని మెజారిటీ కంపెనీలు ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పీఎఫ్ ఖాతాను కలిగి ఉండటం వల్ల ఉద్యోగులు ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే పీఎఫ్ ఖాతా ఉన్నవాళ్లకు కేంద్రం ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందిస్తుంది. గరిష్టంగా పీఎఫ్ ఖాతాదారులకు 7 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. గతంలో పోలిస్తే కేంద్రం ఈ మధ్య కాలంలో ఇన్సూరెట్ బెనిఫిట్ […]

Written By: Kusuma Aggunna, Updated On : July 19, 2021 4:18 pm
Follow us on

దేశంలో ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసేవాళ్లలో ఎక్కువమంది పీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నారు. దేశంలోని మెజారిటీ కంపెనీలు ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పీఎఫ్ ఖాతాను కలిగి ఉండటం వల్ల ఉద్యోగులు ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే పీఎఫ్ ఖాతా ఉన్నవాళ్లకు కేంద్రం ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందిస్తుంది. గరిష్టంగా పీఎఫ్ ఖాతాదారులకు 7 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది.

గతంలో పోలిస్తే కేంద్రం ఈ మధ్య కాలంలో ఇన్సూరెట్ బెనిఫిట్ ను లక్ష రూపాయలు పెంచింది. గతంలో ఈ మొత్తం ఆరు లక్షల రూపాయలుగా ఉండేది. పీఎఫ్ ఖాతాను కలిగి ఉన్నవాళ్లను ప్రతినెలా వారి జీతం నుంచి కొంత మొత్తం కట్ అవుతుందనే సంగతి తెలిసిందే. పీఎఫ్ ఖాతాదారులు అదనంగా డబ్బులు చెల్లించకుండానే కేంద్రం అందిస్తున్న ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ ఇన్సూరెన్స్ కింద కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను అందిస్తుండటం గమనార్హం. పీఎఫ్ ఖాతాదారులు అనారోగ్య సమస్యలు, ప్రమాదం వల్ల మరణించిన పక్షంలో నామినీ ఈ డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ పీఎఫ్ ఖాతాదారుడు నామినీ వివరాలను పొందుపరచని పక్షంలో పీఎఫ్ ఖాతాదారుని భార్య, పిల్లలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి ఆర్హులవుతారు.

బేసిక్ శాలరీ, డీఏ కంటే 35 రెట్లు ఎక్కువ మొత్తం ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుంది. బోనస్ ద్వారా కూడా ఈ ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి. 15,000 రూపాయలు బేసిక్ శాలరీ, డీఏల రూపంలో ప్రతి నెలా పొందుతుంటే బోనస్ తో కలిపి మొత్తం 7 లక్షల రూపాయలు పొందవచ