Homeక్రీడలుక్రికెట్‌Manav Sutar: మానవ్ సుతార్.. టీమ్ ఇండియా స్పిన్ కు సరికొత్త అవతార్..

Manav Sutar: మానవ్ సుతార్.. టీమ్ ఇండియా స్పిన్ కు సరికొత్త అవతార్..

Manav Sutar: అప్పుడప్పుడు రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి బౌలింగ్ వేసేవాడు. రవీంద్ర జడేజా ఈ స్థాయిలో గణాంకాలు నమోదు చేసేవాడు. కులదీప్ యాదవ్ ఇప్పుడు ఒకసారి ఇలాంటి మ్యాజిక్ ప్రదర్శించేవాడు. కానీ ఇన్ని రోజులకు.. టీమిండియా స్పిన్ బౌలింగ్ ఎలా ఉంటుందో ఈ 23 సంవత్సరాల యువకుడు చూపించాడు. మైదానం నుంచి సపోర్ట్ లేకపోయినప్పటికీ..పిచ్ లో జీవం కనిపించకపోయినప్పటికీ.. బంతిని గింగిరాలు తిప్పిన తీరు అద్భుతం.. అనన్య సామాన్యం. ఇతడిని గనక సాన పెడితే ఖచ్చితంగా మరో రవిచంద్రన్ అశ్విన్ అవుతాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు.

ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రెండవ రోజు టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ గిల్ 126, రిషబ్ పంత్ 81, వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు చేసి సత్తా చాటడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 564 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆఫ్ఘనిస్తాన్ భారత బౌలర్ల ముందు తలవంచింది.. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. టీమిండియా బోర్డర్లలో సుతార్ మూడు వికెట్లు పడగొట్టాడు. 16 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అతడు.. అందులో 7 ఓవర్లను మెయిడ్ ఇన్ గా వేశాడు. 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడి ఎకానమీ 1.30 అంటే బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇతడికి ప్రసిద్ కృష్ణ తోడయ్యాడు. అతడు కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ తో సుతార్ అదరగొట్టాడు. పరుగులు తీయడం కాదు కదా.. బంతిని అడ్డుకుంటే చాలు అనేతీరుగా ఆఫ్గనిస్తాన్ బ్యాటర్లలో భయం పుట్టించాడు.

ఐపీఎల్ లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఇతడి మీద గౌతమ్ గంభీర్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఏకైక టెస్ట్ కు అవకాశం కల్పించాడు. వచ్చిన అవకాశాన్ని సుతార్ సద్వినియోగం చేసుకున్నాడు. రాజస్థాన్లోని శ్రీ గంగా నగర్ లో పుట్టిన ఇతడు.. ఎడమ చేతివాటం బ్యాటింగ్ చేస్తాడు. ఎడమచేతి వాటం బౌలింగ్ తో ఆకట్టుకుంటాడు. ఇండియా అండర్ 19, రాజస్థాన్, సెంట్రల్ జోన్, జైపూర్ ఇండియన్స్, ఇండియా ఏ, గుజరాత్ టైటాన్స్, ఇండియా సి, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ఇతడు ఆడాడు. ఎడమచేతి అర్ధడాక్స్ స్పిన్నర్.. అంతేకాకుండా లోయర్ ఆర్డర్లో సమర్థవంతంగా ఆడతాడు.

2022 – 23 రంజి ట్రోఫీ సీజన్లో సుతార్ ఆరు మ్యాచ్ లు ఆడి.. 20.33 సగటుతో 39 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో రాజస్థాన్ జట్టు తరుపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా ఆవిర్భవించాడు. అంతేకాదు రెండు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. 2023 ఎసిసి మెన్స్ ఎమర్జింగ్ కప్ లో టీమిండియా కు ఎంపిక అయ్యాడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడి 19.50 సగటు, 4.21 ఎకనామి రేటుతో 10 వికెట్లు పడగొట్టాడు. ఆ సిరీస్లో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆవిర్భవించాడు. ఐపీఎల్ 2024 కోసం సుతార్ ను గుజరాత్ జడ్పీ కొనుగోలు చేసింది. 2002లో జరిగిన దిలీప్ కప్ ట్రోఫీలో సుతార్ 7 వికెట్లు పడగొట్టాడు. 2025 ఐపీఎల్ వేలంలో గుజరాత్ జట్టు అతడిని 30 లక్షలకు కౌనుగోలు చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version