https://oktelugu.com/

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై పాజిటివ్ ప్రభావం చూపాయి. దాంతో ఆర్థిక, బ్యాంకింగ్, లోహ, టెలికాం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరుగడం సూచీలపై ప్రభావం చూపింది. దాంతో ఆర్థికవ్యవస్థ పునరుత్తేజంపై మదుపర్లలో సందేహాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెక్స్ 587 పాయింట్ల నష్టంతో 52,553 వద్ద […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 19, 2021 / 04:28 PM IST
    Follow us on

    భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై పాజిటివ్ ప్రభావం చూపాయి. దాంతో ఆర్థిక, బ్యాంకింగ్, లోహ, టెలికాం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరుగడం సూచీలపై ప్రభావం చూపింది. దాంతో ఆర్థికవ్యవస్థ పునరుత్తేజంపై మదుపర్లలో సందేహాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెక్స్ 587 పాయింట్ల నష్టంతో 52,553 వద్ద స్థిరపడింది.