Rishabh Pant Viral Video: టీమిండియాలో రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు ఎలాంటి ఫార్మాట్ అయినా సరే దూకుడు మంత్రాన్ని మాత్రమే పాటిస్తాడు. బంతి ఏ దిశలో వచ్చినా సరే దానిని బౌండరీ వైపు మాత్రమే పంపిస్తాడు.. ఎందుకంటే అతడికి అలాంటి బ్యాటింగ్ మాత్రమే వచ్చు. సుదీర్ఘ ఫార్మాట్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్.. పొట్టి ఫార్మాట్.. ఇలా అన్ని విభాగాలలో అతడు అదరగొడతాడు. ఇటీవల ఐపీఎల్లో అతడు సత్తా చూపించలేకపోయినప్పటికీ.. ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో అతడు హాఫ్ సెంచరీ చేసి సత్తా చూపించాడు.
రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 121 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు.. మూడు సిక్సర్లు ఉన్నాయి. వాస్తవానికి సెంచరీకి చేరువగా వచ్చినప్పటికీ.. షాహిది బౌలింగ్ లో అతడు అవుట్ అయ్యాడు. దీంతో నిరాశతో అతడు మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ బౌలింగ్లో అతడు గట్టిగా కొట్టాడు. అతడు కొట్టిన కొట్టుడుకు బంతి గాల్లోకి లేచింది. అంతేకాదు నేరుగా డ్రోన్ ను తగిలింది. అది వెంటనే కింద పడిపోయింది. ఆ సమయంలో ఆఫ్గనిస్తాన్ ఫీల్డర్లు ఎవరు కూడా ఆ బంతిని అందుకోవడానికి ప్రయత్నించలేదు.
ఈ సంఘటన నిజమా.. కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే.. అది అబద్ధం అని తేలింది. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వీడియోను రూపొందించినట్టు సమాచారం. మ్యాచ్ జరుగుతున్నప్పుడు రిషబ్ పంత్ అలాంటి షాట్ ఆడలేదని.. బంతి అలా పైకి వెళ్లలేదని అభిమానులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు డ్రోన్ అంత తక్కువ ఎత్తులో ఉండదు. పైగా ఇటీవల కాలంలో రోబోటిక్ కెమెరాలు వాడుతున్నారు.
“రిషబ్ పంత్ ఇలాంటి బ్యాటింగ్ చేయడం కొత్త కాదు. ఇలా దూకుడుగా ఆడటం కూడా తొలిసారి కాదు. కాకపోతే అతడు కొడితే బంతి ఎన్నడు కూడా డ్రోన్ కెమెరాలను తాకలేదు. వాటిని కింద కూల్చలేదు.. రిషబ్ పంత్ బ్యాటింగ్ చూస్తుంటే ఆనందంగా ఉందని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
