Vizag Steel Plant: ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. అక్కడి పారిశ్రామికవేత్తలను ఆయన కలుస్తున్నారు. అనేక కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. రష్యా ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అంశాలను ఆయన అక్కడి ప్రభుత్వానికి వివరిస్తున్నారు. మొత్తంగా ఏపీ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామం లాగా ఉంది అనేలా నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారు.
దోహా ప్రాంతంలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో నారా లోకేష్ అప్పట్లో పాల్గొన్నారు. అనే కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టించే విధంగా ఒప్పించారు. అధికారులతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇందులో కొన్ని కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు మొదలుపెట్టాయి. మిగతా కంపెనీలు కూడా క్యూలో ఉన్నాయి. ఐటి నుంచి మొదలుపెడితే ఇన్ఫ్రా వరకు అన్ని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని నారా లోకేష్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ రష్యాలో పర్యటించడం.. అక్కడి వ్యాపారవేత్తలను కలవడం సంచలనంగా మారింది. అంతేకాదు నారా లోకేష్ రష్యాలో ఉండగానే.. వైజాగ్లో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊహించని కానుక ఎదురయింది. అది కాస్త విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరోసారి ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది.
విశాఖ ఉక్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. అనేక రకాల సమస్యలు ఆ కర్మగారాన్ని వేధిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారానికి కాస్త జవసత్వం లభించింది అని చెప్పవచ్చు. ఇదంతా జరుగుతుండగానే రష్యాలో పర్యటిస్తున్న నారా లోకేష్.. విశాఖ ఉక్కు కర్మగారానికి గుడ్ న్యూస్ లభించేలా చేశారు. ఎందుకంటే రష్యా దేశానికి చెందిన నోవోస్టల్ ఎం అనే కంపెనీ 7వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం తయారు చేసే మెరైన్ స్టీల్ కు రష్యాలో విపరీతమైన డిమాండ్ ఉంది. పైగా ఇప్పుడు మెరైన్ స్టీల్ ఆధారంగా అక్కడ అనేక రకాల కట్టడాలు నిర్మిస్తున్నారు. అందువల్లే నోవోస్టల్ కంపెనీ విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే దీని తెర వెనుక నారా లోకేష్ ఉన్నట్టు సమాచారం.
నారా లోకేష్ కొద్దిరోజులుగా రష్యాలో ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడ అనేక రకాల వ్యాపార కార్యకలాపాలను.. ఇతర సంస్థలను పరిశీలిస్తున్న విషయం విదితమే. అయితే ఆయన తెర వెనుక అనేక రకాల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడిన నేపథ్యంలోనే.. విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి సంస్థలు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ ఇన్వెస్ట్ కార్యరూపం దాల్చితే విశాఖ ఉక్కు కర్మాగారం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి.
