Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ భావసారుప్యత గల పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు యోచనను పూర్తిగా మార్చిపోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవడానికి కేసీఆర్ చెన్నై వెళ్లారు. దీంతో మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ను కేసీఆర్ తెరపైకి తెస్తారని అందరూ అనుకుంటున్నారు.

కానీ జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆలోచించే పరిస్థితిలో కేసీఆర్ లేరని.. తెలంగాణలో తన సొంత పార్టీ భవిష్యత్తుపై ఆయన ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. త్వరలోనే లోలోపల పెద్ద తిరుగుబాటు వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2024లో జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల తర్వాత జాతీయస్థాయిలో టీఆర్ఎస్ అస్తిత్వమే ఉండదని హాట్ కామెంట్స్ చేశారు.
బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా చేసిన ఆలోచనే కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ అని టీపీసీసీ చీఫ్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటైతే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు.. కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు.. బీజేపీకి లబ్ధి చేకూర్చే సాధనంగా కేసీఆర్ ఉపయోగించబోతున్నారని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: ఐఏఎస్ ల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది.. గొనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు
ప్రధాని మోదీకి కేసీఆర్ ఏజెంట్ అని సెక్యులర్ పార్టీలన్నీ గ్రహించాయని రేవంత్ అన్నారు. కేసీఆర్ ను ఎవరూ నమ్మరన్నారు. బీజేపీ మీడియా మద్దతుతో కేసీఆర్ జాతీయ స్తాయిలో తన ఫ్రంట్ గురించి హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారని ఆయన అన్నారు.
ఆలయాల సందర్శన పేరుతో కేసీఆర్ ఒక సాకుగా చూపుతూ నాటకం ఆడుతూ స్టాలిన్ ను లకిసి బీజేపీ అనుకూల రాజకీయం చేస్తున్నాడని రేవంత్ అన్నారు. కేసీఆర్ బీజేపీ ఏజెంట్ అన్నది బట్టబయలు అయ్యిందని అన్నారు.
Also Read: స్టాలిన్ ను అందుకు ఒప్పించిన కేసీఆర్?