Aadi Pinisetty: తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా చిత్రంలో నటిస్తున్నారు. హీరో రామ్ సరసన క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ షెడ్యూల్ జరుగుతున్నది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లో కొన్ని మార్పులు చేయనుందట యూనిట్ బృందం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆది పినిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఆది పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే తాజాగా విడుదలైన పోస్టర్లో రఫ్ లుక్లో కనిపిస్తున్నారు ఆది.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతంకుపైగా షూటింగ్ పూర్తయ్యింది.గుండెల్లో గోదారి, నిన్ను కోరి,సరైనోడు ,రంగస్థలం వంటి చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షక అభిమానులలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందూరు. హీరోగా విలన్ విభిన్నమైన పాత్రలో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి, కీర్తి సురేష్ , జగపతి బాబు నటించిన “గుడ్ లక్ సఖి” ఏడాది డిసెంబర్ 31న విడుదలకు సిద్ధంగా ఉంది.
Happy birthday brotha..let’s kickass this year! Have a great one! @AadhiOfficial 🤗
Love..#RAPO pic.twitter.com/z5uNV6n4r6
— RAm POthineni (@ramsayz) December 14, 2021