Kcr Third Front: ఏమో అనుకున్నాం గానీ.. కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై బాగానే ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో కూడా థర్డ్ ఫ్రంట్ అంటూ తిరిగిన కేసీఆర్.. ఆ తర్వత సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం గట్టి ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన కేసీఆర్.. నిన్న ముంబై వెళ్లి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను, శరద్ పవార్‌ను కలిసి మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇందుకోసం లోకల్ పార్టీలను కలుపుకుని పోతున్నారు. అయితే వారంతా కూడా కేసీఆర్ చెప్పిన మాటలకు ఒప్పుకున్నట్టే తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ వేదికను కేసీఆర్ ప్రస్తావించగా.. ఠాక్రే, పవార్ ఒప్పుకున్నట్టే కేసీఆర్ మాటల్లో స్పష్టం అవుతోంది. ఈ జోష్ లోనే మరో టూర్ చేపట్టనున్నారు కేసీఆర్.
Also Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ లో గెలుపెవరిది?
బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవేగౌడను కలవనున్నారు కేసీఆర్. ఆయనతో పాటు మాజీ సీఎం అయిన కుమార స్వామిని కూడా కలిసి చర్చించనున్నారు. అయితే కేసీఆర్ కూటమి అంశాన్ని ప్రస్తావించినప్పుడే.. అందరికంటే ముందు ఫోన్ చేసి ప్రశంసించింది కూడా దేవెగౌడనే. గతంలో కూడా ఓసారి ఆయన్ను కలిశారు కేసీఆర్. కానీ ఇప్పుడు మాత్రం పక్కా పొలిటికల్ ప్లాన్‌తోనే వెళ్తున్నట్టు తెలుస్తోంది.
ఇక నిన్న కేసీఆర్ టీమ్ లో ప్రకాశ్ రాజ్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి చేసింది. ఇప్పుడు బెంగుళూరు మీటింగ్‌లో కూడా ఆయనే కీలకం కానున్నట్టు తెలుస్తోంది. ఆయనది కూడా కర్నాటకనే కావడం, పైగా గతంలోనూ కేసీఆర్ దేవెగౌడను కలిసినప్పుడు ప్రకాశ్ వెంటే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయనే కీలకం అవుతారని అంతా చర్చించుకుంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ ఇలా మరి ఇంకెంత మందిని కలుపుకుని ఫ్రంట్ ఏర్పాటు చేస్తారో.
Also Read: కొత్త జీవోలతో భారీగా పెరిగిన ట్రాఫిక్ చలాన్లు.. రోడ్డెక్కాలంటేనే వణికిపోతున్న జనాలు..!