https://oktelugu.com/

Rashmika Mandanna: ర‌ష్మిక ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 25ఏండ్ల‌కే అన్ని కోట్లు వెన‌కేసింది..!

Rashmika Mandanna: సినిమా రంగం అనేది అవకాశాల మీద న‌డిచే ప‌డ‌వ లాంటిది. ఒక్క సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిందంటే చాలు వ‌రుస బెట్టి ఆఫ‌ర్లు వ‌చ్చేస్తుంటాయి. అలాంటి వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతోంది ఓ యంగ్ హీరోయిన్‌. ఆమెనే ర‌ష్మిక మంద‌న్న‌. క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారిపోయింది. ఇక తెలుగులో అయితే ఏకంగా వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 21, 2022 / 12:37 PM IST
    Follow us on

    Rashmika Mandanna: సినిమా రంగం అనేది అవకాశాల మీద న‌డిచే ప‌డ‌వ లాంటిది. ఒక్క సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిందంటే చాలు వ‌రుస బెట్టి ఆఫ‌ర్లు వ‌చ్చేస్తుంటాయి. అలాంటి వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతోంది ఓ యంగ్ హీరోయిన్‌. ఆమెనే ర‌ష్మిక మంద‌న్న‌. క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారిపోయింది. ఇక తెలుగులో అయితే ఏకంగా వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

    Rashmika Mandanna

    ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి ఈ అమ్మ‌డుకు. మొన్న‌టికి మొన్న పుష్ప మూవీతో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకుంది. దీంతో వ‌ర‌స‌గా ప్యాన్ ఇండియా మూవీల్లో ఈమెకు ఛాన్సులు వ‌స్తున్నాయంట‌. ఇక ఇటు సినిమాల‌తోనే కాకుండా.. అటు పెద్ద పెద్ద క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ చేస్తూ రెండు చేతుల‌తో సంపాదిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ఛలో నుంచి మొద‌లు పెడితే పుష్ప వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్లే ఆమె ఖాతాలో ప‌డ్డాయి. అందుకే ఇన్ని ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

    Also Read:  ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో మృతి

    ఇక కుర్రాళ్ల‌లో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ప్ర‌స్తుతం ఆమె వయస్సు 25 ఏండ్లు మాత్రమే. ఎంత లేద‌న్నా ఇంకో ప‌దేండ్లు హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఆమె ఆస్తులు ఎన్ని అనే టాపిక్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సౌత్ లోని అన్ని భాష‌ల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. కాబ‌ట్టి ఒక్క సినిమాకు రూ.3 నుంచి రూ.4 కోట్ల దాకా తీసుకుంటోందంట‌.

    Rashmika Mandanna

    ఇక త‌మిళంలో అయితే రూ.కోటిన్న‌ర‌, మ‌ళ‌యాళంలో అయితే రూ.కోటి దాకా డిమాండ్ చేస్తోందంట‌. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న ఈ ముద్దు గుమ్మ దాదాపు రూ.37 కోట్ల దాకా సంపాదించిందంట‌. అయితే గ‌త రెండేండ్ల‌లోనే ఈమె సంపాద‌న బాగా పెరిగింది. అంత‌కు ముందు పెద్ద‌గా పారితోషికం ఆమెకు లేదు. కానీ ఇప్పుడు మాత్రం కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటూ.. ఎక్కువ సినిమాలు చేస్తోంది.

    ఈ కార‌ణంగానే ఆమె ఏడాదికి రూ.20 కోట్ల దాకా పోగేసుకుంటోంది. ఇక యాడ్స ప‌రంగా కూడా ఏడాదికి రూ.కోటి దాకా తీసుకుంటోందంట‌. ఇక త్వ‌ర‌లోనే ఆమె న‌టించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ వ‌చ్చే నెల 4న రిలీజ్ కాబోతోంది. ఇక పుష్ప ది రూల్ లో కూడా న‌టిస్తోంది. అటు తమిళంలో కూడా స్టార్ హీరోల స‌ర‌స‌న ఆమెకు ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.

    Also Read:  వైరల్ అవుతున్న కళావతి పాటకు సితార స్టెప్పులు

    Tags