https://oktelugu.com/

ఫామ్ హౌస్ నుంచి ప్రగతిభవన్ కు కేసీఆర్.. కారణమిదే..?

రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ నేడు బీజీబీజీగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కొన్నిరోజులుగా ఫౌమ్ హౌజ్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్ కు రానున్నారు. నేడు మధ్యాహ్నం 2గంటల నుంచి బ్యాక్ టూ బ్యాక్ అధికారులతో కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలా? నిర్వహించాలనే అనే దానిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 8, 2020 / 12:15 PM IST
    Follow us on

    రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ నేడు బీజీబీజీగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కొన్నిరోజులుగా ఫౌమ్ హౌజ్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్ కు రానున్నారు. నేడు మధ్యాహ్నం 2గంటల నుంచి బ్యాక్ టూ బ్యాక్ అధికారులతో కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలా? నిర్వహించాలనే అనే దానిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    తెలంగాణలో కరోనా వైరస్ కట్టడిలోకి వచ్చిందనుకున్న సమయంలో లాక్డౌన్ సడలింపు చేయడంతో ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వైద్యశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ చర్చించనున్నారు. గడిచిన వారంరోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. పేషంట్లతో గాంధీ ఆస్పత్రి నిండుకొంది. అదేవిధంగా నిమ్స్ లో వైద్య సిబ్బంది కరోనా సోకడంతో అక్కడ తాత్కాలికంగా వైద్య సేవలు నిలిపివేశారు. వీటన్నింటిపై సమీక్షలో చర్చించున్నారు. కేసులను ఏవిధంగా కట్టడి చేయాలో చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించేలా చర్యలు తీసుకోబోతున్నారు.

    అదేవిధంగా పదో తరగతి పరీక్షలపై రాష్ట్రమంతటా సస్పెన్స్ నెలకొంది. పరీక్షలు నిర్వహిస్తారా? లేదా రద్దు చేస్తారా? అనే ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రమంతా పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర హైకోర్టు ఓకే చెప్పడంతో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అయితే విద్యార్థులందరికీ ఒకేసారీ పరీక్ష నిర్వహించాలా? లేదా దశల వారీగా నిర్వహిస్తే వచ్చే ఇబ్బందులను చర్చించనున్నారు. ఇదిలా ఉంటే పరీక్షలను రద్దుచేసి ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చిన ఇంటర్నల్ మార్కులతో గ్రేడింగ్ ఇస్తే ఎలా ఉంటుందని అధికారులు చర్చించనున్నారు. ప్రభుత్వం పరీక్షల రద్దుకే మొగ్గుచూపుతుండటంతో విద్యార్థులకు గ్రేడింగ్ ఎలా ఇస్తారనేది ఆసక్తి మారింది. ఈ పరీక్షలకు హాజరుకాని విద్యార్థుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో చర్చించనున్నారు. ఈ బేటిలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.