5 States Election Results KCR Reaction: బీజేపీని అర్జెంటుగా గద్దె దించేయాలె.. ఆ పార్టీ గోల్ మాల్ పార్టీ.. నరేంద్ర మోడీ అంత మోసగాడు లేడు.. ఈ కామెంట్లు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ. అదేనండి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నిత్యం కేసీఆర్ జపించింది ఈ పదాలనే. ఎవ్వరూ తిట్టనంత బలంగా బీజేపీని తిట్టేసి దేశంలో ఫ్రంట్ పెట్టేసి జాతీయ నేతగా ఎదగాలని చూశారు.
కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ వికసించింది. దీంతో ఈ ఫలితాలపై కేసీఆర్ గానీ.. టీఆర్ ఎస్ నేతలు గానీ మాట్లాడట్లేదు. కేసీఆర్ సడెన్ సైలెంట్ వెనక ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. అసలు గెలవదు అనుకున్న బీజేపీ అతి పెద్ద రాష్ట్రమైన యూపీతో పాటు మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాలను తన ఖాతాలో వేసుకుంది.
Also Read: తర్వాత టార్గెట్ ఆ రెండు రాష్ట్రలే.. మోడీ వ్యూహం మొదలెట్టేశారు
దీంతో మోడీ వేవ్ మరింత పెరిగింది. అంటే బీజేపీకి మైలేజ్ వచ్చిందన్నమాట. ఇతర రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తామంటూ చెప్పిన కేసీఆర్ మాటలు మొత్తం ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఈ ఫలితాల మీద ఆయన మాట్లాడట్లేదు. మరో కారణం ఏంటంటే కాంగ్రెస్ మట్టికరవడం. దేశంలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవకుండానే ఇంటి దారి పట్టింది.
వాస్తవానికి బీజేపీతో విభేదించి కాంగ్రెస్‌కు దగ్గరవ్వాలని కేసీఆర్ భావించారు. ఇందుకోసం కొన్ని ప్రయత్నాలను కూడా మొదలు పెట్టేశారు. కానీ కాంగ్రెస్ ఖతం అని తేల్చేశాయి ఫలితాలు. ఇక మరో ముఖ్యమైన కారణం ఏంటంటే.. పంజాబ్ లో కేజ్రీవాల్ పార్టీ ఆప్ గెలవడం. వాస్తవానికి బీజేపీ వ్యతిరేక కూటమి వస్తే దానికి పెత్తనం చెలాయించాలని కేసీఆర్ తో పాటు కేజ్రీవాల్ కూడా బలంగా ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు కేజ్రీవాల్ రెండు రాష్ట్రాల్లో గెలిచి కేసీఆర్ కంటే విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కంటే ఎక్కువ సీట్లు గెలిచి మోడీకి కేజ్రీవాలే పోటీ అన్నట్టు ఫలితాలు వచ్చాయి. దాంతో తనకు పోటీగా ఉన్న కేజ్రీవాల్ ను హైలెట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ఫలితాలపై కేసీఆర్ మౌనంగా ఉన్నారు. నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ గురించి ఏం మాట్లాడినా ఇప్పుడు తన మీద సెటైర్లు పేలుతాయనే కారణం కూడా ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలతో కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది.
Also Read: బీజేపీ గెలుపు: కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు.. గుండె పరీక్షల కోసం ఆస్పత్రికి.. బీజేపీ సెటైర్లు