Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలలో చాలా మూవీస్ క్లాసికల్ హిట్స్ గా నిలిచాయి. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. తన నటనలోని వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి అంటే చాలామందికి ఇష్టం… ముఖ్యంగా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలా విషయంలో కొంతవరకు డీలా పడ్డాడు. కానీ రీసెంట్ గా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కి 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. అలాగే తన కామెడీ టైమింగ్ ను కూడా మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశాడు…
ఇక ఇలాంటి చిరంజీవి గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో రామ్ చరణ్, ప్రభాస్ లు తన సినిమాల్లో కొన్ని సినిమాలను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన చెప్పడం రామ్ చరణ్ జగదేక వీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలను రీమేక్ చేయాలని, ప్రభాస్ ఘరానా మొగుడు సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. మొత్తానికైతే వీళ్ళిద్దరు ఈ మూడు సినిమాలను రీమేక్ చేస్తే చూడాలని ఉందని అది సాధ్యమయ్యే పనైతే బాగుండేది అంటూ చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి తన జనరేషన్ లో ఉన్న హీరోలతో పోటీ పడుతూనే ఈ జనరేషన్లో ఉన్న హీరోలకు సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్లు సాధించే విజయాలను తన విజయాలుగా భావించి తెలుగు సినిమా ఖ్యాతిని ముందుకు తీసుకెళుతున్నందుకు ప్రతి ఒక్కరి విషయంలో తను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ పలు సందర్భాల్లో తెలియజేస్తుండటం విశేషం…
ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దానికి ఏమాత్రం తీసిపోకుండా భారీ విజయాన్ని సాధించే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది…