CM KCR: ఎక్కడెవడు లేకపోతే అక్కమెగుడే దిక్కు అనేది సామెత. ఇన్నాళ్లు బీజేపీ మీద ఆగ్రహంతో ఊగిపోయిన కేసీఆర్ ఇక దిగి రాక తప్పడం లేదు. బీజేపీని విద్యుత్ విషయంలో నానా బూతులు తిట్టిన కేసీఆర్ కు ఇక దిక్కు లేక కేంద్రం విధించే షరతులకు తలొగ్గుతున్నారు. ఏరు దాటేదాక ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లు అవసరాలు తీరేదాక బతిమాడటం తీరాక తిట్టడం ఇది ప్రతి ఒక్కరిలోనూ జరిగేదే. ఇక్కడ కూడా కేసీఆర్ ఇన్నాళ్లు బీజేపీ ప్రభుత్వం కరెంటు విషయంలో సరైన విధానలు అవలంభించడం లేదని నానా బూతులు మాట్లాడి చివరకు కేంద్రం చెంతకే చేరుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇంతవరకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. అది ఇరవై నాలుగు గంటలు అంటూ గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఏపీని నిందించారు. కేంద్రానికి తలొగ్గిన జగన్ రైతుల నోట్లో మట్టి కొడుతూ పంపుసెట్లకు మీటర్లు బిగించారని నానా మాటలు అన్నారు. ఇప్పుడు కేంద్రం చెప్పినట్లు వింటానని విద్యుత్ సంస్కరణల అమలు చేపడతామని చెప్పడం దేనికి నిదర్శనం.
Also Read: TRS Foundation Day: ఏప్రిల్ 27వ టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. కేసీఆర్ మళ్లీ ఏం చేస్తారో?
ప్రస్తుతం డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో ఇప్పుడు కేంద్రం తప్ప ఆదుకునే వారెవరు లేరు. అందుకే ఇప్పుడు కేంద్రం ఎలా చెబితే అలా వింటామని చెబుతూ సంస్కరణల అమలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించడానికి మాత్రం వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీటర్లు బిగిస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే దానికి సమ్మతించడం లేదని సమాచారం.

ఇప్పుడు కేసీఆర్ కేంద్రం విధించే షరతులకు తలొగ్గే అవకాశం ఏర్పడుతోంది. ఇంతవరకు మంత్రులు సైతం కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ నిందించిన వారే. దీంతో ఇంతవరకు వినియోగించుకునే కరెంటుకు కేసీఆర్ నిధులు ఇవ్వడం లేదు. అందుకే డిస్కంలు సైతం తాము కరెంటు ఇవ్వలేమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేంద్ం సూచించే షరతులకు ఏ మేరకు తలొగ్గుతారో తెలియాల్సి ఉంది.
Also Read:Pawan Kalyan Son First Film: పవన్ కళ్యాణ్ కొడుకు మొదటి సినిమా ఆ దర్శకుడితో..??
[…] Vijayasai Reddy: ఒకరేమో జగన్ కు వీర విధేయుడు. ఆయన గీసిన గీటు దాటడు. ఆయనతో పాటే జైలు జీవితం గడిపాడు. మరొకరు జనసేనాని పవన్ కళ్యాణ్ కు భక్తుడు. మనసు నిండా గుడు కట్టుకొని, నిద్రలేచి అడిగినా తన ధైవమని చెబుతాడు. పవన్ పై ఈగ వాలనివ్వడు. అటువంటి భిన్న వ్యక్తుల మధ్య మాటల తూటాలు పేలితే.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు కదా. ఆ ఇద్దరు వ్యక్తులు ఎంపీ విజయసాయిరెడ్డి, నిర్మాత, నటుడు బండ్ల గణేష్. గత రెండు రోజులుగా ట్విట్టర్ వేదికగా కాక పుట్టిస్తున్నారు. హాట్ హాట్ కామెంట్లతో దీటైన ప్రశ్నలు, సమాధానాలతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. తనకు సరితూగే వ్యక్తులతో తలపడే విజయసాయిరెడ్డి అనూహ్యంగా బండ్ల గణేష్ కు దొరికిపోయారు. […]