TRS Foundation Day: టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలకు ఆహ్వానం పంపనున్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ కార్యక్రమాలు, తీర్మానాలు తయారు చేస్తున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించే ఇందులో నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.
పదింటికల్ల నేతలందరు చేరుకోవాలని చెబుతున్నారు. 10 నుంచి 11 గంటల వరకు ప్రజాప్రతినిధుల సభ్యత్వ నమోదు, 11.05 గంటలకు కేసీఆర్ ప్రసంగం ఉంటాయి. సాయంత్రం 5 గంటలకు సభ ముగుస్తుంది. వచ్చే ఎన్నికల్లో అవలంభించబోయే వ్యూహాలపై సీఎం కేసీఆర్ నేతలకు తెలియజేయనున్నట్లు సమాచారం.
Also Read: Shah Jahan: సండే స్పెషల్: షాజహాన్ కన్న కూతురిని కూడా వదలలేదా..? సంచలన నిజాలివీ
మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యే పోటీ ఉండనుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనని తేలిపోతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ మేరకు నిర్ణయాలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తారోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ భవితవ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న కేసీఆర్ ఇదే వేదికగా పలు నిర్ణయాలు వెలువరించనున్నట్లు చెబుతున్నారు.
ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుబందు, దళితబందు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సాగునీటి ప్రాజెక్టులు, పింఛన్లు అన్నింటిపై సమగ్ర వివరణ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ధీటైన ప్రతిపక్షం లేకపోవడంతో విజయం తమదేననే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు సమాచారం. కానీ బీజేపీ చాపకింద నీరులా టీఆర్ఎస్ సీట్లను కొల్లగొడుతుందనే భయం వారిలో ఏర్పడింది. దీంతో వారికి అవకాశం ఇవ్వకుండా చేయడానికే కేసీఆర్ పాచికలు వేస్తారనే ప్రచారం సాగుతోంది.