https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బిగ్‌బాస్‌ను అది కావాల‌ని కోరిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌..!

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్‌లో చాలా ట్విస్టుల‌తో కూడిన టాస్క్‌ల‌ను మ‌నం ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పుడూ ఎమోష‌న‌ల్ అయితే ఏం బాగుంటుంద‌ని.. బోల్డ్ కంటెంట్‌కు పెద్ద పీట వేస్తున్నాడు బిగ్ బాస్‌. పైగా గొడ‌వ‌లు ఏ మాత్రం త‌క్కువ‌గా ఉండ‌కుండా చూసుకుంటున్నాడు. ఇక‌పోతే హౌస్‌లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎంత‌లా ఫైర్ చూపిస్తున్నాడో మ‌నం చూశాం. ఇక‌పోతే బిగ్ బాస్‌లో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌లు గ్రాండ్ గా నిర్వ‌హించారు. తాను ప్ర‌భుదేవాను చిన్న‌ప్ప‌టి నుంచే […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 17, 2022 / 10:43 AM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: బిగ్ బాస్‌లో చాలా ట్విస్టుల‌తో కూడిన టాస్క్‌ల‌ను మ‌నం ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పుడూ ఎమోష‌న‌ల్ అయితే ఏం బాగుంటుంద‌ని.. బోల్డ్ కంటెంట్‌కు పెద్ద పీట వేస్తున్నాడు బిగ్ బాస్‌. పైగా గొడ‌వ‌లు ఏ మాత్రం త‌క్కువ‌గా ఉండ‌కుండా చూసుకుంటున్నాడు. ఇక‌పోతే హౌస్‌లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎంత‌లా ఫైర్ చూపిస్తున్నాడో మ‌నం చూశాం.

    Bigg Boss Telugu OTT

    ఇక‌పోతే బిగ్ బాస్‌లో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌లు గ్రాండ్ గా నిర్వ‌హించారు. తాను ప్ర‌భుదేవాను చిన్న‌ప్ప‌టి నుంచే ఆరాధించేవాడ‌నని అదే న‌న్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలిపిందంటూ త‌న చిన్ననాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఇక ఆయ‌న ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా కూడా చేశారు.

    Also Read: Shah Jahan: సండే స్పెషల్: షాజహాన్ కన్న కూతురిని కూడా వదలలేదా..? సంచలన నిజాలివీ

    అయితే ఎప్పుడూ ముక్కుసూటి త‌నంతో అంద‌రి మీద అరిచేసే మాస్ట‌ర్‌.. ఏప్రిల్ 16న త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మాత్రం కాస్త ప్ర‌శాంతంగా క‌నిపించాడు. ఇక ఇంటి కెమెరాలో త‌న కోరిక‌ను వెల్ల‌డించాడు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌ట‌న్ బిర్యానీని పంపించ‌మ‌ని కోరాడు. అయితే అత‌ని కోరిక బిగ్ బాస్ నెర‌వేర్చాడా లేదా అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది.

    Bigg Boss Telugu OTT

    ఇక ఈ వారం నామినేష‌న్‌లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఉన్నారు. కాగా ఆయ‌న‌కు అటు అభిమానుల నుంచి భారీగానే మ‌ద్ద‌త ఉంది. అదే ఆయ‌న‌ను కాపాడుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కాక‌పోతే బిగ్ బాస్‌లో అన్నీ ట్విస్టులో జ‌రుగుతున్నాయి. పైగా ఎలిమినేష‌న్ కూడా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటోంది. కాబ‌ట్టి ఆదివారం ఎవ‌రు అవుట్ అవుతారో చూడాలి.

    Also Read:Prabhas: ఆ కారు ప్రభాస్ ది కాదట?

    Tags