https://oktelugu.com/

కేసీఆర్ కొత్త ప్లాన్: ఈటలపై ఎల్ రమణ పోటీ

హుజురాబాద్ ఉప ఎన్నికపై అప్పుడే పార్టీల్లో సందడి నెలకొంది. ప్రత్యర్థి పార్టీని ఎలా ఢీకొట్టాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తున్నాయి. ఈటల రాజేందర్ ను ఢీకొనే అభ్యర్థి కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్వేషణ కొనసాగిస్తున్నారు. దీటైన వ్యక్తి అయితేనే ఈటలను ఓడించవచ్చని భావిస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నాయి. ఎలాగైనా హుజురాబాద్ లో పాగా వేయాలని చూస్తున్నాయి. కేసీఆర్ అయితే ఎప్పటి నుంచో పలువురు అభ్యర్తుల […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 9, 2021 6:58 pm
    Follow us on

    KCR New Planహుజురాబాద్ ఉప ఎన్నికపై అప్పుడే పార్టీల్లో సందడి నెలకొంది. ప్రత్యర్థి పార్టీని ఎలా ఢీకొట్టాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తున్నాయి. ఈటల రాజేందర్ ను ఢీకొనే అభ్యర్థి కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్వేషణ కొనసాగిస్తున్నారు. దీటైన వ్యక్తి అయితేనే ఈటలను ఓడించవచ్చని భావిస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నాయి.

    ఎలాగైనా హుజురాబాద్ లో పాగా వేయాలని చూస్తున్నాయి. కేసీఆర్ అయితే ఎప్పటి నుంచో పలువురు అభ్యర్తుల బలంపై ఆరా తీసేందుకు సర్వే చేయిస్తున్నారు. అంతర్గత సర్వే చేస్తూ సమ ఉజ్జీ అయిన వారి కోసమే వెతుకుతున్నారు. సర్వేల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇందులో ఈటలకు సమానంగా నిలిచే వారిలో టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్. రమణ అయితే సరిపోతారనే విషయం తెలిసింది.

    దీంతో ఆయన కోసం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్ రమణకు కూడా టీఆర్ఎస్ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీనిపై కేసీఆర్ తో సమావేశం తరువాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ వేదికగా సీఎం సమక్షంలోనే ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    పార్టీ మార్పుపై ఇంకా రమణ ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పార్టీ మారేందుకు స్వయంగా ఆయనే ప్రకటిస్తారని ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో వేచి చూసే ధోరణికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎల్ రమణ పార్టీలో చేరితో పరిణామాలు మారుతాయని గులాబీ నేతలు భావిస్తున్నారు.

    కేంద్ర ప్రభుత్వం మాత్రం హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో నిర్వహించే ఉద్దేశంలో లేదని తెలుస్తోంది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికి పార్టీలు మాత్రం తమ ఉనికి చాటుకోవాలనే చూస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, పనిలో పనిగా కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నట్లు సమాచారం.