KTR: త‌గ్గేదే లే.. ఫెడరల్ ఫ్రంట్ ను వ‌ద‌ల‌ని కేసీఆర్.. ప్లాన్ మ‌ళ్లీ షురూ..!

KTR: ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్ అసాధ్యమని రాజకీయ పరిశీలకులు చాలా సార్లు పేర్కొన్నారు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టు వదలని విక్రమార్కుడి వలే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఈ ఫ్రంట్ ప్రస్తావన చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కొద్ది రోజుల పాటు ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఈ విషయమై కార్యచరణ స్టార్ట్ చేశారు. వామపక్ష పార్టీల నేతలతో ఇప్పటికే సమావేశమైన కేసీఆర్.. ఫెడరల్ […]

Written By: Mallesh, Updated On : January 12, 2022 1:44 pm

KTR

Follow us on

KTR: ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్ అసాధ్యమని రాజకీయ పరిశీలకులు చాలా సార్లు పేర్కొన్నారు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టు వదలని విక్రమార్కుడి వలే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఈ ఫ్రంట్ ప్రస్తావన చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కొద్ది రోజుల పాటు ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఈ విషయమై కార్యచరణ స్టార్ట్ చేశారు.

KTR

వామపక్ష పార్టీల నేతలతో ఇప్పటికే సమావేశమైన కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించినట్లు సమాచారం. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాలతో చర్చించారు. తాజాగా బిహార్ ప్రతిపక్షనేత తేజస్వియాదవ్ తో చర్చలు జరిపారు. త్వరలో కేసీఆర్ శరద్ పవార్ తో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Also Read: అపోలో నుంచి ఏఐజీకి మ‌ళ్లిన వీఐపీలు.. క‌రోనా వ‌స్తే ఇక్క‌డే ట్రీట్ మెంట్‌..

మొత్తంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న మాదిరిగానే జాతీయ రాజకీయాల్లోనూ ఫెడరల్ ఫ్రంట్ కోసం కృషి చేయబోతున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేశ్ కీ నేత గా కేసీఆర్ ముందుకు సాగుతారని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసి ఫెడలర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతో గులాబీ పార్టీ అధినేత చర్చిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో‌నూ కేసీఆర్ చర్చలు జరుపుతారని తెలుస్తోంది. అయితే, స్టాలిన్ కాంగ్రెస్‌తోనే ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, కేసీఆర్ మాత్రం స్టాలిన్ ను ఒప్పించి ఫెడరల్ ఫ్రంట్ లో భాగం చేసుకోవాలని చూస్తున్నారట.

ఈ క్రమంలోనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోనూ త్వరలో కేసీఆర్ చర్చలు జరుపుతారట. చూడాలి మరి.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఏ మేరకు సక్సెస్ అవుతారో.. అయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే క్రమంలో కేటీఆర్ కు తెలంగాణ సీఎంగా పగ్గాలు అప్పజెప్పే అవకాశముందని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, ఈ విషయమై కేసీఆర్ ఎటువంటి స్పష్టతను ఇప్పుడయితే ఇవ్వడం లేదు.

Also Read: బంగార్రాజు కొడుకు అనిపించుకున్న నాగచైతన్య.. అంద‌రి ముందే హీరోయిన్‌తో చిలిపి చేష్ట‌లు..

Tags