Corona: ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విషయంలో ప్రభుత్వాలు చెబుతున్న వాటికి, పాటిస్తున్న వాటికి అస్సలు పొంతన ఉండట్లేదు. చెప్పే విషయాలకు, వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతన ఉండట్లేదు. ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీ ట్రీట్ మెంట్‌ను ఏర్పాటు చేశామని చెబుతోంది వైసీపీ ప్రభుత్వం. కానీ మంత్రులకు లేదా ఎమ్మెల్యేలకు కరోనా వస్తే మాత్రం ఇంతకు ముందు వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి పరుగులు తీసేవారు.
అయితే ఇప్పుడు మరో రూటు మార్చారు. అంటే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడం లేదు గానీ.. ఏపీలోనే ఉన్న ఏఐజీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఈ ఆస్పత్రిలో అత్యంత ఖరీదైన వైద్యం ప్రపంచ స్థాయిలో అందుతోంది. ఇందులో కాక్ టెయిల్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ట్రీట్ మెంట్ కూడా అదిస్తున్నారు. దీంతో దగ్గరలో ఇదే సేఫ్ అని వీఐపీ స్థాయి ఉన్న వారంతా కూడా ఇక్కడే చూపించుకుంటున్నారు.
Also Read: బంగార్రాజు కొడుకు అనిపించుకున్న నాగచైతన్య.. అందరి ముందే హీరోయిన్‌తో చిలిపి చేష్టలు..
మొన్నటికి మొన్న మంత్రి కొడాలి నానికి కరోనా వస్తే.. వెంటనే ఈ ఆస్పత్రిలో జాయిన్ అయిపోయారు. ఆయనే కాదు చాలామంది వ్యాపారులు, ఎమ్మెల్యేలు, సినీ సెలబ్రిటీలకు సైతం ఈ ఆస్పత్రి ఇప్పుడు కేరాఫ్ గా మారిపోయింది. అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిలో ఎవరికి కరోనా వచ్చినా సరే.. ఇందులోనే చేరిపోతున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న గవర్నర్ కు కరోనా వస్తే ఆయన కూడా ఈ ఆస్పత్రిలోనే చేరి చికిత్స తీసుకున్నారు.
అంటే అపోలో నుంచి ఏఐజీకి వీఐపీలు మారుతున్నారన్న మాట. ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. కరోనా వస్తే ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చూపించుకోవాలనే డిమాండ్ ఏపీలో ఎప్పటి నుంచో వస్తుంది. కానీ దాన్ని మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోకుండా.. కార్పొరేట్ ఆస్పత్రులకు క్యూ కడుతూనే ఉన్నారు. అంటే మంత్రులు, ఎమ్మెల్యేల వైద్య ఖర్చు కోసం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇలా అపోలో నుంచి ఏఐజీ ఖాతాలోకి మళ్లుతున్నాయన్నమాట.