https://oktelugu.com/

Bandi Sanjay: దొంగలతో జతకట్టినా కేసీఆర్ కు ప్రయోజనముండదు?

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్ని పార్టీలను ఏకం చేసే దిశగా ఆలోచిస్తున్నారని వ్యంగ్యంగా ఆరోపణలు చేశారు. బిహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ వెయ్యి కోట్లు దోచుకుంటే ఇక్కడ కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. అందుకే దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు అవినీతి పరులంతా ఒక్క చోట చేరారని గుర్తు చేశారు. ఎలాగూ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 12, 2022 1:48 pm
    Bandi Sanjay
    Follow us on

    Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్ని పార్టీలను ఏకం చేసే దిశగా ఆలోచిస్తున్నారని వ్యంగ్యంగా ఆరోపణలు చేశారు. బిహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ వెయ్యి కోట్లు దోచుకుంటే ఇక్కడ కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. అందుకే దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు అవినీతి పరులంతా ఒక్క చోట చేరారని గుర్తు చేశారు. ఎలాగూ జైలుకెళ్లే సమయం దగ్గర పడే కొద్దీ కేసీఆర్ అందరిని కలుపుకుని పోయే నిమిత్తం నాటకాలు ఆడుతున్నారని చెబుతున్నారు.

    Bandi Sanjay

    Bandi Sanjay

    317 జీవో సవరించాలని బీజేపీ పోరాటం చేస్తుంటే కేసీఆర్ మాత్రం టాపిక్ డైవర్ట్ చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారు. బీజేపీయేతర పక్షాలతో భేటీ అవుతున్నా వారు సాధించేది ఏముండదు. అవినీతి పరులంతా కలిసి దేశాన్ని దోచుకునేందుకు పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. కమ్యూనిస్టులతో కూడా భేటీ అవుతూ అందరిని ఏకం చేయాలని చూస్తున్నా ఫలితం మాత్రం శూన్యమే. ఎందుకంటే దేశంలో బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతా వట్టిదే అవుతుంది. బూడిదలో పోసిన పన్నీరే అని తెలుసుకుంటే మంచిది.

    Also Read:  త‌గ్గేదే లే.. ఫెడరల్ ఫ్రంట్ ను వ‌ద‌ల‌ని కేసీఆర్.. ప్లాన్ మ‌ళ్లీ షురూ..!

    ప్రధాని మోడీ కున్న చరిష్మాతోనే మరోసారి ఆయన పీఎం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. మధ్యలో ఏదో నీలాంటి అవినీతిపరులు ఏదో చెబితే నమ్మేందుకు ఎవరు సిద్ధంగా లేరు. బీజేపీయేతర పార్టీలతో జట్టు కట్టినా ఒరిగేమీ లేదు. చివరకు జైలుకు వెళ్లడం తప్ప. కేంద్రం కూడా సీరియస్ గా ఉంది. మీ ప్రభుత్వం తీరుపై విచారణ చేపడితే బోలెడన్ని నిజాలు బయటపడే అవకాశాలున్నాయి. అందుకే ముందస్తుగా మేల్కొని బీజేపీయేతర పార్టీలతో కుమ్మక్కు కావాలని చూస్తున్నా అది నెరవేరదు.

    సీఎం కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయి. అవినీతి ఆరోపణలతో అందలాలు ఎక్కినా కుర్చీ దిగక తప్పదు. కేంద్రం కేసీఆర్ పాత్రపై విచారణ చేపట్టిన సంగతి తెలుసుకుని కేంద్రంపై అవినీతి ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందుకే ధాన్యం కొనుగోలు అంశం నుంచి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నా అది ఆచరణ సాధ్యం కావడం లేదు. అందుకే దేశంలోని దొంగలందరిని ఏకం చేసే పనిలో పడ్డారు. పనికి రాని చెత్త అంత పోగయితే కుళ్లి పోతుంది తప్ప పనికిరాదనే విషయం తెలుసుకోవాలి. కేసీఆర్ నాటకాలు కట్టిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. అటు కేంద్రంలో ఇటు రాష్ర్టంలో తలెత్తుకోనీయకుండా చేస్తామని హెచ్చరించారు.

    Also Read: బంగార్రాజు కొడుకు అనిపించుకున్న నాగచైతన్య.. అంద‌రి ముందే హీరోయిన్‌తో చిలిపి చేష్ట‌లు..

    Tags