https://oktelugu.com/

తెలంగాణలో వ్యాక్సిన్ పై కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు వేయడానికి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు వేయడానికి ప్రైవేటు ఆస్పత్రులన్నింటికి కేసీఆర్ సర్కార్ అనుమతిలిచ్చింది. అన్ని ఆస్పత్రులు వ్యాక్సిన్లను వ్యాక్సినేషన్ వేయవచ్చని.. ప్రజలందరూ ఎక్కడైనా.. పని ప్రదేశాల్లో వేసుకోవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణలో వ్యాక్సినేషన్ ను ప్రైవేటు సంస్థలకు అనుమతిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థలు వ్యాక్సినేషన్ కోసం […]

Written By:
  • NARESH
  • , Updated On : May 25, 2021 / 06:38 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు వేయడానికి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

    వ్యాక్సిన్లు వేయడానికి ప్రైవేటు ఆస్పత్రులన్నింటికి కేసీఆర్ సర్కార్ అనుమతిలిచ్చింది. అన్ని ఆస్పత్రులు వ్యాక్సిన్లను వ్యాక్సినేషన్ వేయవచ్చని.. ప్రజలందరూ ఎక్కడైనా.. పని ప్రదేశాల్లో వేసుకోవచ్చని స్పష్టం చేసింది.

    తెలంగాణలో వ్యాక్సినేషన్ ను ప్రైవేటు సంస్థలకు అనుమతిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థలు వ్యాక్సినేషన్ కోసం ప్రైవేటు ఆస్పత్రులతో కోఆర్డినేషన్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

    ఇక ఈనెల 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. షాప్ కీపర్స్, ఆటో డ్రైవర్లు, సెలూన్, మెడికల్ షాప్స్, ఎక్కువ జనాలతో కాంటాక్ట్ అయ్యే వారందరికీ వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 30 లక్షల వ్యాక్సిన్లను సిద్ధం చేస్తోంది.