అదిరిపోయే లుక్ లో విల‌క్ష‌ణ న‌టుడు !

‘రావు ర‌మేష్’ ఈ జనరేషన్ లో తెలుగు ప్రేక్షకులకు దొరికిన మరో విల‌క్ష‌ణ న‌టుడు. నటనలో సహజత్వం, డైలాగ్స్ చెప్పడంలో వైవిధ్యం, పాత్రలకు తగ్గట్టు గెటప్స్ మార్చడంలో భిన్నత్వం ఆయకు మాత్రమే సాధ్యం. కాగా నేడు రావు ర‌మేష్ పుట్టిన‌రోజు. దాంతో ఆయన నటిస్తోన్న ‘మ‌హాస‌ముద్రం’ సినిమా నుండి ఆయన లుక్‌ ని రివీల్ చేస్తూ చిత్రబృందం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. రావు ర‌మేష్‌ కి బ‌ర్త్‌ డే విషెస్ చెబుతూ వచ్చిన ఈ […]

Written By: admin, Updated On : May 25, 2021 6:32 pm
Follow us on


‘రావు ర‌మేష్’ ఈ జనరేషన్ లో తెలుగు ప్రేక్షకులకు దొరికిన మరో విల‌క్ష‌ణ న‌టుడు. నటనలో సహజత్వం, డైలాగ్స్ చెప్పడంలో వైవిధ్యం, పాత్రలకు తగ్గట్టు గెటప్స్ మార్చడంలో భిన్నత్వం ఆయకు మాత్రమే సాధ్యం. కాగా నేడు రావు ర‌మేష్ పుట్టిన‌రోజు. దాంతో ఆయన నటిస్తోన్న ‘మ‌హాస‌ముద్రం’ సినిమా నుండి ఆయన లుక్‌ ని రివీల్ చేస్తూ చిత్రబృందం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

రావు ర‌మేష్‌ కి బ‌ర్త్‌ డే విషెస్ చెబుతూ వచ్చిన ఈ పోస్ట‌ర్‌ లో రావు ర‌మేష్ గూని బాబ్జీగా కొత్తగా కనిపించారు. పోస్టర్ లో ఆయన గెటప్ చూస్తేనే తెలుస్తోంది. ఆయనది సినిమాలో కీల‌క పాత్ర‌ అని. ఇక తనకు ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర ఇచ్చినా సరే, త‌న‌దైన న‌ట‌న‌తో రావు రమేష్ పూర్తి న్యాయం చేస్తారని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు.

కాగా ‘RX 100’ లాంటి సంచలన విజయం తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి నుండి తన రెండవ చిత్రంగా ఈ ‘మ‌హా స‌ముద్రం’ సినిమాని తీసుకువస్తున్నాడు. ఇక మల్టీ స్టార్రర్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, శర్వానంద్‌ లు హీరోలుగా చేయటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. లవ్ స్టోరీలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ కథానాయికలుగా కనువిందు చేయబోతున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూరుస్తుండగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.