పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. కానీ ఆమెను మాత్రం ఓడించారు. దీంతో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో సీఎం పదవికి అనర్హురాలంటూ ఆమెను ఓడించిన సువెందు అధికారి పేర్కొన్నారు. మమతకు నైతిక విలువలు లేవని అన్నారు. ఉంటే ఆమె సీఎం పీఠం ఎక్కరని ఎద్దేవా చేశారు. ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చినా ఆమెను పరాజయం పాలు చేశారు. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యతగా ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు.
గతంలో కేరళలో సీపీఎం పార్టీ నాయకుడు అచ్యుతానందన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కేరళలలో సీపీఎం పార్టీ అఖండ విజయం సాధించినా అచ్యుతానందన్ మాత్రం ఓటమి చెందారు. దీంతో పార్టీ నిర్ణయం మేరకు ఆయన సీఎం పీఠానికి దూరంగా ఉండిపోయారు. కానీ ఇక్కడ సీపీఎం ఆయన సొంత పార్టీ కాదు. మమతా బెనర్జీకి టీఎంసీ సొంత పార్టీ అందుకే ఆమె మళ్లీ పోటీ చేసి గెలిచి తన కోరిక నెరవేర్చుకునే వీలుంది.
ప్రాంతీయ పార్టీల అధినేత ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. కాదనే అధికారం ఎవరికీ ఉండదు. ప్రాంతీయ పార్టీలకు ఒక్కరే అధినేత ఉంటారు కాబట్టి ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. కాదంటే ఇంటికే. అందుకే ఎవరూ మాట్లాడరు. ఏం జరిగినా స్పందించరు. ప్రాంతీయ పార్టీలో సమష్టి నిర్ణయాలు ఉండవు. అధినేత ఏం చెబితే అదే. ఎంత చెబితే అంతే. టీఆర్ఎస్ అధినేతకు వారసుడు కేటీఆర్ ఉన్నారు. చంద్రబాబుకు లోకేష్ ఉన్నా ఆయన పార్టీని నడిపే సత్తా లేనివాడుగా చూస్తారు. జగన్ కు సైతం వారసులు లేరు. మమత బెనర్జీకి సైతం వారసులు లేరు.
మమతా బెనర్జీని నందిగ్రామ్ లో ఎందుకు ఓడించారనే దానిపై చర్చ సాగుతోంది. రాష్ర్టమంతా బ్రహ్మరథం పట్టినా కావాలనే అక్కడ ఓటమి చెందడం బాధాకరం. అయితే దీనిపై సువెందు అదికారి రాద్ధాంతం చేస్తున్నారు. ఆమె ఎందుకు ఓటమి పాలయ్యారో బేరీజు వేసుకుని ఉండాలని సూచిస్తున్నారు. పార్టీ గెలిచినా ఆమెను ప్రజలు సమ్మతించలేదు అందుకే పరాజయం పాలు చేశారు. నైతిక బాధ్యత వహించి ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు.