తెలంగాణలో ప్రజలకు కేసీఆర్ మరో వరం!

నిర్బంధ సాగు పేరుతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సన్నాలు సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకనుగుణంగానే రాష్ట్రంలో సన్నాలు సాగయ్యాయి. ఈసారి ఎఫ్‌సీఐ పెద్ద మొత్తంలో సన్నాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని చివరి గింజ వరకు కూడా కొంటామని ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. దీంతో అక్కడి ప్రభుత్వం కొత్త ఆలోచనకు తెరతీసింది. రేషన్‌ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే.. పొరుగు రాష్ట్రాల అనుభవాలు తెలంగాణ సర్కార్‌‌ను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే.. […]

Written By: NARESH, Updated On : October 10, 2020 11:03 am
Follow us on

నిర్బంధ సాగు పేరుతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సన్నాలు సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకనుగుణంగానే రాష్ట్రంలో సన్నాలు సాగయ్యాయి. ఈసారి ఎఫ్‌సీఐ పెద్ద మొత్తంలో సన్నాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని చివరి గింజ వరకు కూడా కొంటామని ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. దీంతో అక్కడి ప్రభుత్వం కొత్త ఆలోచనకు తెరతీసింది. రేషన్‌ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే.. పొరుగు రాష్ట్రాల అనుభవాలు తెలంగాణ సర్కార్‌‌ను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఎక్కువ ప్రచారం చేయకుండా పని కానిచ్చేయాలని చూస్తున్నట్లుంది.

Also Read: మహానగరం.. మళ్లీ మునిగింది..ఈ పాపం ఎవరిది?

తెల్లరేషన్ కార్డు దారులందరికీ సన్నబియ్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి ఓ 30, 40 కేబినెట్ భేటీలు జరిగాయి. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. మధ్యలో పౌరసరఫరాల మంత్రి ఎవరు చెప్పారు అని ఎదురు తిరిగి .. సన్న బియ్యానికి నాణ్యమైన బియ్యం అని పేరు పెట్టారు. అవి కూడా ఎవరికీ అందడం లేదు.

అనాలోచితంగా నిర్ణయం తీసుకుని.. విపరతీమైన ప్రచారం చేసుకోవడం వల్ల.. ఈ పరిస్థితి వచ్చిందని ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఇప్పిటికీ అర్థం కాలేదు. మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్లుగా వాయిదాలు వేస్తూ పోతున్నారు. ఇప్పటికే మూడు పంట సీజన్లు మారినా రేషన్ పంపిణీకి కావాల్సిన సన్నబియ్యం సేకరించలేకపోయారంటే.. ఇంక ఎప్పుడు సేకరిస్తారో చెప్పడం కష్టం.

Also Read: విశాఖలో సామాన్యుడికి షాక్.. లక్షన్నర కరెంట్ బిల్లు..?

తెలంగాణలో నిర్బంధ సాగుతోపాటు ఈసారి జల వనరులు అనుకున్నట్లుగా ఉండడంతో వరి సాగు పెరిగింది. దీంతో ప్రణాళికాబద్ధంగా సన్నబియ్యం పంపిణీ చేయడానికి అవసరమైన వనరులు సమీకరించుకున్నట్లుగా అవుతోంది. కానీ.. ఏపీలో మాత్రం ప్రణాళిక లేకపోవడం.. ఏడాదిన్నర దాటిపోయినా సన్నబియ్యం ఇవ్వకపోవడంతో రేషన్ కార్డు దారుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి అసంతృప్తి ప్రజల్లో కనిపించకూడదని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అందుకే ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా ఒకవేళ అమలు చేయాలనుకుంటే వెంటనే రంగంలోకి దిగి అందించాలని చూస్తోంది.