https://oktelugu.com/

CM KCR Delhi Tour: కేసీఆర్‌ చలో ఢిల్లీ.. దేశవ్యాప్త పర్యటనకు ప్రణాళిక.. ఇక జాతీయ రాజకీయాలకే ఫిక్స్‌

CM KCR Delhi Tour: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల ఎంట్రీకి ముహూర్తం కిందిరిందా అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. దాదాపు 17 రోజులు ఫామ్‌హౌస్‌కే పరిమితమై సుదీర్ఘ సమాలోచనలు చేసిన కేసీఆర్‌.. ఎట్టకేలకు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు పొలిటికల్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వారం పది రోజులు ఢిల్లీ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : May 20, 2022 / 03:38 PM IST
    Follow us on

    CM KCR Delhi Tour: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల ఎంట్రీకి ముహూర్తం కిందిరిందా అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. దాదాపు 17 రోజులు ఫామ్‌హౌస్‌కే పరిమితమై సుదీర్ఘ సమాలోచనలు చేసిన కేసీఆర్‌.. ఎట్టకేలకు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు పొలిటికల్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వారం పది రోజులు ఢిల్లీ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీలో మేధావులు, మీడియా ప్రతినిధులతో మేథోమధనం జరుపుతారు. ఆ తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేయనున్నారు.

    KCR

    తెలంగాణ ప్రభుత్వం తరపున సాయం చేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. ఆ మేరకు దాదాపుగా ఐదారు వందల మందికి ఆయన సాయం అందించనున్నారు. ఆప్‌ ముఖ్య నేతల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన రైతుల జాబితా రెడీ చేశారు. వారికి సాయం అందించేందుకు వివరాలు కూడా తీసుకున్నారు. తర్వాత ఢిల్లీ నుంచేకేసీఆర్‌ బెంగళూరు పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది. కుదిరితే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేయాలనుకుంటున్న కేసీఆర్‌ ఇక ప్రత్యక్ష పర్యటనలు చేయక తప్పదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించకపోయినా… కలసి రావడానికి ఎవరూ సిద్ధపడకపోయినా ముందుకే వెళ్లాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. పట్టువదలకుండా ప్రయత్నాలు చేసి.. దేశంలో రాజకీయంగా గుణాత్మక మార్పు తీసుకు రావాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

    Also Read: Polavaram- Shivalingam: పోలవరంలో బయటపడిన శివలింగం ఏ కాలం నాటిది?

    విదేశీ పర్యటనలో కేటీఆర్‌..
    కేసీఆర్‌ తనయుడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు విదేశీ పర్యటకు వెళ్లారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ తర్వాత దావోస్‌ వెళ్తారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో ప్రభుత్వ వ్యవహారాలను చూసుకునే కేటీఆర్‌ కూడా నగరంలో లేని సమయంలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం టీఆర్‌ఎస్‌లోనూ ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో పరిపాలనా వ్యవహారాలను కేసీఆర్‌ మొత్తం సెట్‌ చేసి పెట్టారని.. టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ జాతీయ రాజకీయ పర్యటనలపై టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా నమ్మకంగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తరహాలో ఓ వేవ్‌ను కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో తెస్తారని అంటున్నారు.

    మన రైతుల పరిస్థితి ఏంటి?
    తెలంగాణలో ప్రస్తుతం రైతులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. యాసంగిలో వరివేయొద్దని కేసీఆర్‌ చేసిన ప్రకటనతో చాలామంది వరిసాగుకు దూరమయ్యారు. కొంతంమంది కేసీఆర్‌ తన ఫామ్‌ హౌస్‌లో వరి వేశారని తెలిసి ఆలస్యంగా వరి వేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్న కేసీఆర్‌ చివరకు తానే వెనక్కు తగ్గారు. యాసంగిలో వరి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కోతలు పూర్తయ్యాయి. ధాన్యం పూర్తిగా కొనుగోలు కేంద్రాలకు చేరింది. ఈ క్రమంలో అకాల వర్షాలు ఇప్పటికే మూడుసార్లు రైతులకు నష్టం కలిగించాయి. చేతికి వచ్చిన పంట నోటికి అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది రుతుపవనాలు ముందుగా వస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సగం పంట కూడా కొనుగోలు చేయలేదు.

    CM KCR

    ఈ క్రమంలో కేసీఆర్‌ ఢిల్లీ వెల్లడం, అదీ తన రాజకీయ భవిష్యత్‌ కోసం కావడం విమర్శలకు తావిస్తోంది. స్థానికంగా ఉండి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాల్సిన సమయంలో కేసీఆర్, కేటీఆర్‌ రాష్ట్రంలో లేకుండా పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వచ్చే ఖరీఫ్‌పై రైతులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాల్సి ఉంది. అధికారులు తూతూమంత్రంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖరీఫ్‌ ప్రణాళికపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ సమయంలో ‘తల్లికి అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా’ అన్నట్లు సీఎం కేసీఆర్‌ రాష్ట్ర రైతులను గాలికి వదిలేసి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    Also Read:Pawan Kalyan :తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ప్రకటన.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    Tags