Homeజాతీయ వార్తలురైతులకు కేసీఆర్ శుభవార్త.. రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

రైతులకు కేసీఆర్ శుభవార్త.. రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు!


తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతులకు మరో శుభవార్త చెప్పారు. రైతు బంధు స్కీమ్ అమలు ద్వారా ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రైతు వేదిక ప్రారంభం కానుంది. రైతు వేదిక ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో రైతు వేదికల ఏర్పాటు, రైతు వేదికల ఉపయోగాలు, ఇతర విషయాల గురించి వివరిస్తారు. కేసీఆర్ రైతు వేదిక ప్రారంభం అనంతరం ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నాయి. ప్రభుత్వం రైతు వేదికల ద్వారా రైతులంతా ఒకే చోట చేరి పంటలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర విషయాల గురించి చర్చించుకునే అవకాశం కల్పిస్తోంది.

రైతు వేదిక ప్రారంభానికి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావు, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో మొత్తం 2,604 రైతు వేదికలను నిర్మిస్తోంది. ప్రభుత్వం ఇందుకోసం 573 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

ఏపీలో రైతు భరోసా కేంద్రాలలా తెలంగాణలో రైతు వేదికలు ఏర్పాటు కానున్నాయని సమాచారం. అయితే రైతు వేదికల ఏర్పాటుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రైతులకు ప్రయోజనం చేకూరేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version