https://oktelugu.com/

ఐఆర్సీటీసీ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసుకోలేదా.. అయితే మీరు నష్టపోయినట్లే…?

బస్సు, విమానం, కారు ప్రయాణాలతో పోలిస్తే చాలామందికి రైలు ప్రయాణమే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరూ రైలు ప్రయాణాలను ఇష్టపడతారు. అయితే రైలు ప్రయాణాలు చేయాలంటే చాలారోజుల ముందే టికెట్లను బుక్ చేసుకోవాలి. ప్రయాణించే తేదీ దగ్గర పడే కొద్దీ రైళ్లలో సీట్లు లభించే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటే మంచిది. రైళ్లలో తరచూ ప్రయాణించే వాళ్లకు ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం గురించి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 29, 2020 / 02:47 PM IST
    Follow us on


    బస్సు, విమానం, కారు ప్రయాణాలతో పోలిస్తే చాలామందికి రైలు ప్రయాణమే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరూ రైలు ప్రయాణాలను ఇష్టపడతారు. అయితే రైలు ప్రయాణాలు చేయాలంటే చాలారోజుల ముందే టికెట్లను బుక్ చేసుకోవాలి. ప్రయాణించే తేదీ దగ్గర పడే కొద్దీ రైళ్లలో సీట్లు లభించే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటే మంచిది.

    రైళ్లలో తరచూ ప్రయాణించే వాళ్లకు ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం గురించి అవగాహన ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే టికెట్ బుక్ అయినట్లు మొబైల్ కు మెసేజ్ వస్తుంది. అయితే టికెట్ల కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఒక అకౌంట్ నుంచి ఒక నెలలో ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది.

    అయితే ఆరు టికెట్లు మాత్రమే పరిమితి ఉండటం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్లకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఎవరైతే వాళ్ల ఐఆర్సీటీసీ అకౌంట్ కు ఆధార్ నంబర్ ను లింక్ చేస్తారో వాళ్లు ఒక నెలకు గరిష్టంగా 12 టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. కుటుంబంతో సహా రైళ్లలో ప్రయణించే వాళ్లకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.

    ఐఆర్సీటీసీ అకౌంట్ కు ఆధార్ నంబర్ ను జత చేయడం చాలా సులభం. వెబ్ సైట్ లో లాగిన్ అయిన తరువాత ఆధార్ కేవైసీ అనే ఆప్షన్ ను ఎంచుకుని వివరాలను నమోదు చేసి ఓటీపీని ఎంటర్ చేయాలి. వెబ్ సైట్ లో ఆధార్ నంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.