తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. జగన్, కేసీఆర్ లో టెన్షన్

రెండు తెలుగు రాష్ట్రాలు ఉప ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు ఎన్నికలు కూడా ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలకు రెఫరెండంలా మారబోతున్నాయి. త్వరలో బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేష‌న్ కూడా త్వర‌లోనే రానుంద‌ని తెలుస్తోంది. అయితే.. ఇత‌ర రాష్ట్రాల ప‌రిస్థితిని ప‌క్కనపెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు అధికార పార్టీలు టీఆర్ఎస్‌, వైసీపీల్లో కొత్త టెన్షన్‌కు […]

Written By: Srinivas, Updated On : March 9, 2021 10:35 am
Follow us on


రెండు తెలుగు రాష్ట్రాలు ఉప ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు ఎన్నికలు కూడా ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలకు రెఫరెండంలా మారబోతున్నాయి. త్వరలో బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేష‌న్ కూడా త్వర‌లోనే రానుంద‌ని తెలుస్తోంది. అయితే.. ఇత‌ర రాష్ట్రాల ప‌రిస్థితిని ప‌క్కనపెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు అధికార పార్టీలు టీఆర్ఎస్‌, వైసీపీల్లో కొత్త టెన్షన్‌కు కార‌ణంగా మారాయి.

Also Read: కార్పొరేషన్లలో సంచలనం: ఎక్స్ క్లూజివ్ సర్వే ఫలితాలు

ఈ ఉప పోరులో గెలిస్తేనే ఇరు ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటాయి. లేకపోతే.. తమ పాలనపై వ్యతిరేక‌త పెరిగింద‌నే అంచ‌నాలు ఖాయం. తెలంగాణ‌ రాష్ట్రంలో త్వర‌లోనే నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గనుంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచిన నోముల న‌ర‌సింహ‌య్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇటీవ‌ల‌ దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గగా అధికార పార్టీ సిట్టింగ్ సీటు కోల్పోయింది. అదే స‌మ‌యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకున్నా.. ప్రతిప‌క్షాలు బ‌ల‌ప‌డ్డాయి. దీంతో కేసీఆర్ సాగ‌ర్‌లో గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆయ‌న ప్రచారం కూడా ప్రారంభించారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ను పూర్తి లైట్‌గా తీస్కొన్న కేసీఆర్ సాగ‌ర్‌‌లో మాత్రం అప్పుడే ఓ రౌండ్ చుట్టేశారు. సాగ‌ర్‌లో క‌నుక గెలిచి తీరకుంటే కేసీఆర్‌పై వ్యతిరేకత ప్రారంభ‌మైంద‌నే భావించాల్సి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. దీంతో ఇక్కడ సాగ‌ర్ టెన్షన్ పీక్స్‌లో ఉంది.

ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే.. తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక్కడ నుంచి 2019లో విజ‌యం సాధించిన బ‌ల్లి దుర్గా ప్రసాద్‌ కూడా క‌రోనాతో మృతి చెందారు. త్వర‌లోనే ఇక్కడ ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. ఇది వైసీపీకి సిట్టింగ్ స్థానం. ఇప్పటి వ‌ర‌కు నాలుగుదశ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ మెజారిటీ పంచాయ‌తీలు సాధించింద‌ని చెబుతున్నా.. ఆశించిన విధంగా 90 శాతం ఏక‌గ్రీవాలు సాధించ‌లేక పోయింది. అదేస‌మ‌యంలో త్వర‌లోనే మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో ఇక్కడ ఓట‌రు నాడి కూడా పార్టీని భ‌యపెడుతోంది. న‌గ‌ర పోరులో కూడా ఫ‌లితాలు అనుకున్నట్టు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ఇప్పటికే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

Also Read: సీఎం కేసీఆర్ కొత్త పీఆర్వోగా ఈ సీనియర్ జర్నలిస్ట్?

ఈ క్రమంలో తిరుపతి పార్లమెంటు స్థానం ద‌క్కించుకోవడంపై పార్టీ అంత‌ర్మథ‌నం ప‌డుతోంది. ఇప్పటివ‌ర‌కు అభ్యర్థిని కూడా ప్రక‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ ఈ స్థానంలో ఫ‌లితం అనుకున్న స్థాయిలో రాక‌పోతే జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రస్థాయిలో బెడిసికొట్టే ప్రమాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్కడ‌ గెలిచినా.. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల‌కంటే ఎక్కువ‌గా మెజారిటీ రావాలి. లేకపోతే.. అది కూడా ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే అవుతుందని వారి అభిప్రాయం. అందుకే.. ఈ రెండు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పెద్దల్లోనూ ఉత్కంఠ వాతావరణమైతే కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్