‘కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు..!’

కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌ లో ఉన్నాయని, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చిన నాడు 12లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. గాంధీభవన్‌ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60ఏళ్ల కోరికను […]

Written By: Neelambaram, Updated On : June 2, 2020 1:37 pm
Follow us on

కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌ లో ఉన్నాయని, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చిన నాడు 12లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షల నిరుద్యోగులు ఉన్నారు.

గాంధీభవన్‌ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60ఏళ్ల కోరికను సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలు జరిగాయని చెప్పిన నాయకులు ఇప్పుడు నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు రావడం లేదని, తెలంగాణ వచ్చిన నాడు 12లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షల నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌ లో ఉన్నాయని, ఒక్క ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆరోపించారు. లక్షకోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. పక్క రాష్ట్రం పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలు దోచుకుపోతుంటే పాలకులు కళ్లుమూసుకుని కూర్చుకున్నారని దుయ్యబట్టారు. 2014 నుంచి కృష్ణా ప్రాజెక్టులు పెండింగ్‌ లో పెట్టారని ఉత్తమ్‌ ఆరోపించారు.