https://oktelugu.com/

నాటి ఉద్యమకారులు నేడు ఏమైపోయారు?

దశాబ్దాల పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. జూన్ 2న నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తయింది. ఈ ఆరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టిసారించారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వ […]

Written By: , Updated On : June 2, 2020 / 02:36 PM IST
Follow us on

Respect for telangana martyrs

దశాబ్దాల పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. జూన్ 2న నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తయింది. ఈ ఆరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టిసారించారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కొన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధితో దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఓ సామాజికవర్గానికే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.

కేసీఆర్ క్యాబినెట్లో ఓసీలే అధికం..
కేసీఆర్ క్యాబినెట్లో అగ్రకులాలకే ప్రాధాన్యం దక్కింది. కేసీఆర్ మంత్రివర్గంలో మొత్తం 18మందికి ఛాన్స్ దక్కింది. వీరిలో ఓసీలు(రెడ్లు ఆరుగురు, వెలమలు నలుగురు, కమ్మ ఒకరు) ఉన్నారు. బీసీలు నలుగురు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రెడ్ల నుంచి ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. వెలమ నుంచి సీఎంగా కేసీఆర్‌‌‌‌, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌ రావు, హరీశ్‌‌‌‌రావు, కేటీఆర్‌ ఉన్నారు. కమ్మ వర్గం నుంచి పువ్వాడ అజయ్‌‌ ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గాల నుంచి నలుగురు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నుంచి ఒక్కొక్కరి పదవి దక్కింది. బీసీల నుంచి ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌‌, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్‌, ఎస్సీ నుంచి కొప్పుల ఈశ్వర్‌‌‌‌, మైనార్టీల నుంచి మహమూద్‌‌‌‌ అలీ, ఎస్టీ నుంచి సత్యవతి రాథోడ్‌‌‌‌కు అవకాశం దక్కింది.

సమగ్ర కుటుంబ సర్వే చెబుతున్న లెక్కలు..
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో ఓసీ జనాభా 8శాతం ఉన్నాయి. ఈ వర్గానికి 61 శాతం పదవులు దక్కాయి. 92 శాతం జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలకు 38 శాతం పదవులే దక్కాయి. 52శాతం బీసీలు ఉండగా 22శాతం మంత్రి పదవులే దక్కాయి.15 శాతం ఉన్న ఎస్సీలకు, 10శాతం ఉన్న ఎస్టీలకు, 14శాతం మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవే మాత్రమే దక్కడం గమనార్హం.

గొర్రెలు, బర్లు వారికి.. పదవులు మాత్రం వీరికి..
తెలంగాణలో 92శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల వారికి పదవుల్లో కేసీఆర్ మొండిచేయి చూపారు. ఇక సంక్షేమం పేరుతో గొర్ల కాపర్లకు గొర్ల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, బర్ల పంపిణీ వంటి వాటితో ఆ వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకున్నారని ఆయావర్గాల ప్రజలు వాపోతున్నారు. అలాగే తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాడిన ఉద్యమకారులు, కళకారులు నేడు పత్తాకు లేకుండా పోవడం వెనుక కారణంలేంటో తెలియడం లేదు. ఒకప్పుడు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గద్దర్, విమలక్క లాంటి పేర్లు కూడా నేడు తెలంగాణలో విన్పించడం లేదు. వీరంతా ఏమైయ్యరనే ప్రశ్న సామన్యులను తొలుస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాల్లేక నైరాశ్యంలో మునిగిపోయారు. నిరుద్యోగులు మరో ఉద్యమానికి నాంది పలికేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో పదవులు దక్కించుకున్న ఓసీలు వారికి సామాజిక వర్గానికే పెద్దపీఠ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వ్యాపారాలన్నీ వారి చేతుల్లోనే..
ఈ ఆరేళ్లలో హైదరాబాద్ చుట్టు పక్కల కంపెనీలన్నీ వెలమ, రెడ్డి వర్గాల వారి చేతుల్లోనే వ్యాపారాలన్నింటిని ప్రభుత్వం పెడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. విలువైన ప్రభుత్వ భూములన్నీ ఈ సామాజిక వర్గానికే కట్టబడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరేళ్లలో ఓసీ వర్గాలు అభివృద్ధిలో జెట్ స్పీడుతో దూసుకెళుతుండగా మిగిలిన వర్గాల అభివృద్ధి మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడ అన్న చందంగా తయారైందని ఆయావర్గాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో 92శాతంగా ఉన్న జనాభా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి పెద్దపీఠ వేయాలని ఆయావర్గాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!