https://oktelugu.com/

తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చేలా కేసీఆర్ నిర్ణయం

హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మధ్యలో ఉన్న మెట్రోపాలిటన్ నగరం. ఒక్క ఆదిలాబాద్ కు తప్పితే మిగతా అన్ని జిల్లాల నుంచి కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు. విద్యా, వైద్యం, ఉద్యోగాలు ఏదైనా సరే అంతా హైదరాబాద్ కే వస్తుంటారు. ఏపీ జిల్లాల నుంచి కూడా ఉపాధి కోసం ఇక్కడే వస్తారు. అంత పెద్ద సిటీలో ప్రజల వైద్య అవసరాలు తీర్చే ప్రణాళికలు ఇన్నాళ్లు లేవు. కరోనాతో ఆలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. హైకోర్టులు చీవాట్లు పెట్టాయి. అందుకే […]

Written By:
  • NARESH
  • , Updated On : June 20, 2021 / 09:05 AM IST
    Follow us on

    హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మధ్యలో ఉన్న మెట్రోపాలిటన్ నగరం. ఒక్క ఆదిలాబాద్ కు తప్పితే మిగతా అన్ని జిల్లాల నుంచి కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు. విద్యా, వైద్యం, ఉద్యోగాలు ఏదైనా సరే అంతా హైదరాబాద్ కే వస్తుంటారు. ఏపీ జిల్లాల నుంచి కూడా ఉపాధి కోసం ఇక్కడే వస్తారు. అంత పెద్ద సిటీలో ప్రజల వైద్య అవసరాలు తీర్చే ప్రణాళికలు ఇన్నాళ్లు లేవు. కరోనాతో ఆలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. హైకోర్టులు చీవాట్లు పెట్టాయి. అందుకే తాజాగా కేసీఆర్ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణతోపాటు హైదరాబాద్ ప్రజల అవసరాలు తీర్చేలా మొత్తం 4 సూపర్ స్పెషలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మించాలని డిసైడ్ అయ్యింది.

    హైదరాబాద్ పరిధిలో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న టిమ్స్-గచిబౌలిని నాలుగో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరించడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపింది.

    మూడు కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో అల్వాల్- ఔటర్ రింగ్ రోడ్డు మధ్య మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఒకటి నిర్మించాలని నిర్ణయించారు. మరొకటి ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉంటుంది. రెండోది పండ్ల మార్కెట్ గా మార్చబడిన గడ్డి అన్నారామ్ ప్రాంతంలోని పండ్ల మార్కెట్ ప్రాంగణంలో నిర్మిస్తారు. టిమ్స్ 4వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఉంటుంది.

    ఇలా తెలంగాణ వైద్య అవసరాలు తీర్చేందుకు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పేదరోగులు, ప్రజలకు ఊరటనిచ్చేలా ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం ఉచితంగా చేపట్టిన ఈ ఆస్పత్రుల వల్ల తెలంగాణలో వైద్య అవసరాలు ముఖ్యంగా హైదరాబాదీలకు చాలా మేలు జరుగనుంది.