https://oktelugu.com/

ఫాదర్స్ డే స్పెషల్: సినిమాల్లోనూ ‘నాన్న’నే హీరో!

‘నాన్న..’ మనిషి జీవితంలో ఎంతో విలువ, మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్రధారి. అలాగే ఎక్కువగా గుర్తింపుకు నోచుకోని పాత్రధారి కూడా. నిజమే, అమ్మ ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తోంది, కానీ నాన్న ఈ ప్రపంచాన్నే మనకు పరిచయం చేస్తాడు. అయినా, నాన్న మన కోసం ఏం చేశాడో, మన అభివృద్ధి కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలియదు. ఎందుకంటే.. నాన్న మనతో తన కష్టాల గురించి ఎప్పుడూ చెప్పిన వీరుడు కదా. అంత […]

Written By: , Updated On : June 20, 2021 / 09:05 AM IST
Follow us on

fathers Day‘నాన్న..’ మనిషి జీవితంలో ఎంతో విలువ, మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్రధారి. అలాగే ఎక్కువగా గుర్తింపుకు నోచుకోని పాత్రధారి కూడా. నిజమే, అమ్మ ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తోంది, కానీ నాన్న ఈ ప్రపంచాన్నే మనకు పరిచయం చేస్తాడు. అయినా, నాన్న మన కోసం ఏం చేశాడో, మన అభివృద్ధి కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలియదు. ఎందుకంటే.. నాన్న మనతో తన కష్టాల గురించి ఎప్పుడూ చెప్పిన వీరుడు కదా. అంత గొప్ప వీరుడు అయినా, అమ్మలా ప్రేమను బయటికి చూపించడం ఆయనకు చేతకాదు.

మనం ఇంట్లో హాయిగా ఉండటానికి, నాన్న బయట ఎక్కడో ఎన్నో బాధలు పడుతూ ఉంటాడు. ఇంటికి ఎప్పుడో వచ్చినా, వచ్చి వెళ్లిపోయినా.. ఎదుగుతున్న పిల్లల్ని చూస్తూ లోలోపలే సంతోషిస్తాడు. వాళ్ళ కోసం ఇంకా ఏదో చేయాలని తపన పడుతూ ఉంటాడు. పిల్లలు ఎప్పుడూ నాన్నను మిస్ అవుతున్నాం అని గొడవ చేస్తారు గానీ, నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. అసలు నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదు. అమ్మ ప్రేమకు పరిధులు ఉండవు. కానీ, నాన్న ప్రేమకు పదాలే ఉండవు. ఎందుకంటే నాన్నకు తన పిల్లల పై ఉన్న ప్రేమను పైకి చెప్పటం కూడా రాదు కదా.

మనందరం తల్లి చాటు బిడ్డలం అని గొప్పగా చెప్పుకుంటాం. కనీసం ఇక నుండైనా నాన్న గొప్పతనాన్ని మన పిల్లలకైనా గర్వంగా చెబుదాం. అమ్మ నిజం అయితే.. నాన్న నమ్మకం అని చెబుదాం. అమ్మ నవమాసాలు మోస్తే, నాన్న ఆ బిడ్డ భవిష్యత్తును తన జీవితాంతం మోస్తాడని గొప్పగా చెబుదాం. పిల్లలకు బంగారు బాటలు వేసేందుకు, నాన్న కొవ్వొత్తిలా కరిగిపోతాడని, నాన్న అంటే కొండంత ధైర్యం అని, నాన్న అంటే మన కోసం కష్టాలు పడే అమాయకుడు అని,

నాన్న అంటే మన కోసం బాధలు అవమానాలు పడే గొప్ప త్యాగమూర్తి అని, నాన్న అంటే నడిచే దేవుడు అని, ఏభై ఏళ్ళు వచ్చాక కూడా నాన్న చేయి పట్టుకుని తిరిగే కొడుకు గొప్ప అదృష్టవంతుడు అని ఈ ప్రపంచానికి గర్వంగా సగర్వంగా చాటి చెబుదాం. మరి ఇంత గొప్ప నాన్న గురించి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చి ఉండాలి. కానీ, తెలుగు వెండితెర పై తండ్రి గొప్పతనాన్ని చెప్పే సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి.

పైగా వచ్చిన ఆ సినిమాల్లో కూడా నాన్న ప్రేమను చూపించే సినిమాలు కంటే, నాన్న కన్నీళ్లను సెంటిమెంట్ ను పరిచయం చేసే సినిమాలే ఎక్కువ. అయితే, బిడ్డల భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకునే నాన్న గురించి, నాన్న గొప్పతనాన్ని, నాన్న విలువను మన కంటికి చూపించాయి కొన్ని సినిమాలు. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’. ఎమోషనల్ గా సాగే గొప్ప నాన్న కథ ఇది. డాడీ సినిమా కూడా. కూతురు పై తండ్రికి ఉండే ప్రేమ నాన్న ఊపిరిలాంటిది అని చాటి చెప్పిన సినిమా ఇది.

అలాగే సూర్యవంశం, తండ్రి కొడుకుల ప్రేమకు కోపాలు పగలు ఉండవు అని చాటి చెప్పిన సినిమా. ఇక చనిపోయిన తండ్రి పరువు కోసం, మాట కోసం, ఓ కొడుకు వదులుకున్న జీవితం ‘సన్ ఆఫ్ సత్య మూర్తి’. అలాగే కొడుకు కోసం చేసే ప్రతి చిన్న పని తన జీవితం అని నమ్మే బొమ్మరిల్లు నాన్న గురించి ఎంత అని చెప్పగలం. అందుకే నాన్న ఒక సూపర్ హీరో. హ్యాపీ ఫాదర్స్ డే, ఐ లవ్యూ డాడీ అంటూ సరిపెట్టకుండా మన కోసమే బతుకుతున్న నాన్న కోసం కూడా మనం బతుకుదాం, నాన్న కోసం కూడా మన సమయాన్ని కేటాయిద్దాం.