https://oktelugu.com/

కేసీఆర్ డిసైడ్: ఎమ్మెల్సీలుగా గోరటి, బస్వారాజు, దయానంద్

గవర్నర్‌‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ముగ్గురిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ మంత్రివర్గం తాజాగా ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన మంత్రివర్గం తాజాగా ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా కేంద్రం అడ్వయిజర్, ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్ ల పేర్లను ఖరారు చేశారు. Also Read: సన్న ధాన్యం.. రైతుల పరిస్థితి […]

Written By: , Updated On : November 13, 2020 / 08:19 PM IST
Follow us on

Goreti Venkanna

గవర్నర్‌‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ముగ్గురిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ మంత్రివర్గం తాజాగా ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన మంత్రివర్గం తాజాగా ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా కేంద్రం అడ్వయిజర్, ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్ ల పేర్లను ఖరారు చేశారు.

Also Read: సన్న ధాన్యం.. రైతుల పరిస్థితి అధ్వానం

ఈ ముగ్గురిని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. రేపు శనివారం ఉదయం 11 గంటలకు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.

గవర్నర్‌‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకదానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెంకన్న పేరును టీఆర్‌‌ఎస్‌ ఆమోదించింది.. ఇటీవల వెంకన్న సీఎం కేసీఆర్‌‌ను ప్రగతి భవన్‌లో అందుకే కలిశారు.

Also Read: విపత్తు సాయం: తెలంగాణకు హ్యాండిచ్చిన మోడీ

తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ పదవులు ఇవ్వడం లేదన్న అపవాదును చెరిపేసేందుకే గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ ఇస్తున్నారని.. ఇక నుంచి ఉద్యమకారులకే పట్టం కట్టబోతున్నట్టు దీని ద్వారా కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక రజక, ఆర్యవైశ్యలకు పదవులు ఇచ్చి బీసీ వర్గానికి పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్