సన్న ధాన్యం.. రైతుల పరిస్థితి అధ్వానం

సన్నరకం ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. చీడపీడల వల్ల పంటకు నష్టం రాగా సరైనా ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వానాకాలంలో తెలంగాణ ప్రభుత్వం సన్నరకం సాగు చేయాలని రైతులకు సూచించడంతో లక్షల ఎకరాల్లో సన్నరకం సాగుచేశారు. దొడ్డు రకాల్లో ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ సన్నరకంలో 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నరకం వరిలో చీడపీడల […]

Written By: NARESH, Updated On : November 14, 2020 10:20 am
Follow us on

సన్నరకం ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. చీడపీడల వల్ల పంటకు నష్టం రాగా సరైనా ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వానాకాలంలో తెలంగాణ ప్రభుత్వం సన్నరకం సాగు చేయాలని రైతులకు సూచించడంతో లక్షల ఎకరాల్లో సన్నరకం సాగుచేశారు. దొడ్డు రకాల్లో ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ సన్నరకంలో 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నరకం వరిలో చీడపీడల బెడద అధికంగా ఉంటుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఫైన్ రకాలకు క్వింటాలుకు రూ.1888 కేటాయించింది. సాధారణ రకాలకు రూ. 1868 ఉంది.

Also Read: విపత్తు సాయం: తెలంగాణకు హ్యాండిచ్చిన మోడీ

అయితే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు అరకొర ధరకే అడుగుతుండడంతో రైస్ మిల్లులకు క్యూ కడుతున్నారు. అయితే రైస్ మిల్లుల యాజమానులు కొనుగోలు చేయాడానికి వెనుకాడడంతో రోడ్లపైన ట్రాక్టర్లపై ధాన్యాన్ని ఉంచి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సన్నాలను తీసుకువచ్చిన రైతులు పట్ల దయ లేకుండా మిల్లు యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. అదేమంటే తమ సామర్థ్యానికి కన్నా ఎక్కువగా ధాన్యం వస్తుండడంతో కొనుగోలు చేసేందుకు కష్టమౌతుందని అంటున్నారు. తేమ ఉన్న ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాలు చేయాలని కోరుతున్నారు.

Also Read: రాహుల్ గాంధీ గాలితీసిన ఒబామా.. ఏమన్నాడంటే?

రైతుల దుస్థితిని మిల్లర్లు క్యాష్ చేసుకుంటున్నారు. చేతికొచ్చిన పంట ఎక్కడ నాశనం అవుతుందో అన్న భయంతో రైతులు మద్దతు ధర పెట్టకపోయినా పర్వాలేదని ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. దీంతో కొందరూ రూ. 1750 లకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతులు ప్రశ్నిస్తే తేమ సరిగా లేదని అంటున్నారు. రైతులు ఏమి చేయలేక తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్