https://oktelugu.com/

నోరుతెరిచి సాయం అడిగిన సోనూ సూద్.. దేనికోసమంటే?

సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించే సోనూసూద్‌.. లాక్‌డౌన్‌ టైంలో చాలా మందికి దేవుడయ్యాడు. ఆ స్థాయి సహాయం కూడా మరెవరూ చేయలేదు. ప్రజల కష్టాలను చూసిన సోనూ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాడు. రైతుకు ట్రాక్టర్‌‌ కొనిచ్చాడు. విద్యార్థులకు సెల్ఫోన్లు అందించాడు. మరెంతో మందికి ఉపాధినిచ్చాడు. ఒకటా రెండా సోను చేసిన సేవలు.ఇలా అందరికీ ఆర్థిక సాయం చేస్తున్న సోనూసూద్ ఆశ్చర్యకరంగా తనకు సాయం కావాలంటూ ట్విట్టర్ సాక్షిగా కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 10:05 am
    Follow us on

    సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించే సోనూసూద్‌.. లాక్‌డౌన్‌ టైంలో చాలా మందికి దేవుడయ్యాడు. ఆ స్థాయి సహాయం కూడా మరెవరూ చేయలేదు. ప్రజల కష్టాలను చూసిన సోనూ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాడు. రైతుకు ట్రాక్టర్‌‌ కొనిచ్చాడు. విద్యార్థులకు సెల్ఫోన్లు అందించాడు. మరెంతో మందికి ఉపాధినిచ్చాడు. ఒకటా రెండా సోను చేసిన సేవలు.ఇలా అందరికీ ఆర్థిక సాయం చేస్తున్న సోనూసూద్ ఆశ్చర్యకరంగా తనకు సాయం కావాలంటూ ట్విట్టర్ సాక్షిగా కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

    Also Read: పవన్ సినిమా నేరుగా ఓటీటీలోకి ?

    తాజాగా సోనూ సూద్ ట్వీట్ చేశారు. ‘మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్న 4 నెలల అద్వేత్ ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. వెంటనే బి-నెగటివ్ బ్లడ్ కావాలి. దయచేసి ఆ గ్రూప్ వ్యక్తులు ఎవరైనా ముందుకు వచ్చి రక్తదానం చేయగలరు’ అని సోనూ సూద్ పిలుపునిచ్చాడు.

    సోనూ సూద్ పిలుపు ఇవ్వగానే రెస్పాన్స్ బాగా వచ్చింది. చాలా మంది స్పందించి ముందుకు రావడం విశేషం. సోనూ సూద్ ఇప్పటివరకు ఎవరిని సాయం అడగలేదని.. అలాంటి ఆయన అడిగితే చేయకుండా ఉంటామా అని బినెగెటివ్ గ్రూప్ వ్యక్తులు చాలా మంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం విశేషం.

    Also Read: ప్చ్.. ‘ప్రగతి’ ఆంటీ హీరోయిన్ గా చేస్తోందట !

    మరోవైపు సినిమాలను తన సేవా కార్యక్రమాలను మిక్స్ చేసి చూడొద్దని రెక్వెస్ట్ చేశాడు. ఎప్పట్లానే విలన్ పాత్రలు చేస్తానని, మంచి కథలు వస్తే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తానని.. అంతే తప్ప తన సేవా కార్యక్రమాలు చూసి సినిమాలపై అంచనాలు పెట్టుకోవద్దని కోరుతున్నాడు సోనూ.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్