దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేంద్రంతో కయ్యానికి దిగితే ఆ రాష్ట్రానికే నష్టం. అది అందరికీ తెలిసిందే కూడా. అందుకే చాలావరకు రాష్ట్రాలు కేంద్రం సఖ్యతతో ఉంటుంటాయి. అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రానికి మద్దతుగా నిలుస్తుంటాయి. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుంటాయి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వేరు కుంపటిలా ఉన్నా.. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చు.
అందుకే.. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయంలో చాకచాక్యంగా వ్యవహరిస్తున్నాడు. పెద్దగా రాజకీయ అనుభవం లేకున్నా రాజకీయాలు మాత్రం చదివినట్లుగా ఉన్నాడు. అందుకే.. కేంద్రం కయ్యానికి పోకుండా సపోర్టుగా నిలుస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఎన్డీయేలోకి చేరుతున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. కేంద్రంతో మంచిగా ఉండి.. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. తదితర నిధులు సాధించుకోవాలని జగన్ చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలను నిత్యం కలుస్తూ సాయం కోరుతూనే ఉన్నారు.
ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో ఆర్థిక పరిస్థితి అంతలా బాగోలేదు. ఇక ఏపీ అయితే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ లాస్‌లోనే ఉంది. లోటు బడ్జెట్‌తోనే నడుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నడిపించడం కూడా కష్టంగానే ఉంది. సొంతంగా నిధులు సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కేంద్రం సపోర్టు ఎంతగానో అవసరం. అందుకే.. జగన్ తన పంథాను మార్చుకొని కేంద్రానికి మద్దతునిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రి బిల్లులకు కూడా సపోర్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ బిల్లుల మీద వ్యతిరేకత వచ్చిన వైసీపీ మాత్రం బిల్లులు పాస్ కావడంలో తోడ్పాటునందించింది. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఫ్యూచర్‌లో అయినా కేంద్రం నిధులు ఇవ్వకపోతుందా అనేది జగన్ అంచనా. అందుకనుగుణంగానే కేంద్ర పెద్దల నుంచి జగన్ హామీలు తీసుకుంటూనే ఉన్నాడు. టైం దొరికినప్పుడల్లా హస్తిన బాట పడుతున్నాడు.
ముఖ్యంగా కేంద్రం సపోర్ట్ ఉంటే రాష్ట్రానికి ఏదైనా సాధించుకు రావచ్చు అనే ఆలోచనలోనే ఉన్నారు జగన్. నిన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ కేంద్ర మద్దతు చూసుకొనే జగన్ తెలంగాణపై అటాక్ చేశారు. స్వయానా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో హాజరైన జగన్.. ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఎక్కడివి అని ప్రశ్నించారంటే వెనుక ఎవరి అండ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అపెక్స్ మీటింగ్‌లో కూడా తెలంగాణకు అంత పెద్దగా సపోర్టు దొరికినిట్లుగా అనిపించలేదు. ఏమున్నా డీపీఆర్‌లు సమమర్పించాలంటూ కేంద్రం నుంచి కోరడం ఒకవిధంగా ఇబ్బంది పెట్టే అంశమే.
Also Read: ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వని మోడీ జగన్‌కే ఎందుకిచ్చారు..
ఇక.. కేసీఆర్ విషయానికి వస్తే దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ నేత. టైం దొరికినప్పుడల్లా ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తానంటాడు. గత ఎన్నికల వేళ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. కానీ.. వార్ వన్‌సైడ్‌లా మారడంతో.. బీజేపీ ఏకపక్షంగా గెలుపొందడంతో నాలుక కర్చుకున్నాడు. అప్పటి నుంచి కేంద్ర రాజకీయాలను పక్కన పెట్టాడు. మళ్లీ ఈ మధ్య మరోసారి ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కొడుకును సీఎంని చేసి.. తాను దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో టాక్.
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక కొద్ది రోజుల పాటు ఎడమొహం.. పెడమొహంలా ఉన్న కేసీఆర్ ఆ మధ్య కొంచెం ఫ్రెండ్ షిప్ చేశారు. కరోనా టైంలోనూ కేంద్రం తీసుకొచ్చిన వివిధ అంశాలకు మద్దతుగా నిలిచారు. అటు లాక్‌డౌన్ అయితేనేమీ.. ఇటు వారియర్స్‌కు ఎంకరేజ్‌మెంట్ ఇవ్వడంలో అయితేనేమీ.. మోడీ ఇచ్చిన పిలుపులన్నింటికీ మద్దతు ఇచ్చారు. కానీ.. ఈ మధ్య ఎందుకో మరోసారి కేంద్రంతో ఫైటింగ్‌కి దిగారు.
తాము తీసుకొస్తున్న అగ్రి బిల్లులు, విద్యుత్ బిల్లులతో వచ్చిన నష్టం ఏమీ లేదని కేంద్రం చెబుతున్నా.. కేసీఆర్ మాత్రం ఇక తమ చేతుల్లో నుంచి అన్ని అధికారాలు పోయినట్లేనని ఫైర్ అవుతున్నారు. విద్యుత్ బిల్లుతో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉండదంటూ రాష్ట్రంలోని రైతుల్లో బీజేపీపై వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం తెచ్చారు. ఇక తాజాగా.. వ్యవసాయ బిల్లుపైనా అదే వైఖరితో ఉన్నారు. ఆ బిల్లుతో రైతులకు తీరని నష్టం కలుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకే.. కేంద్రం తీసుకొచ్చిన ఈ రెండు బిల్లులకు టీఆర్‌ఎస్ మద్దతు కూడా ఇవ్వలేదు. మరోవైపు జీఎస్టీ నిధులు కూడా ఇవ్వడం లేదంటూ ఏకంగా దేశవ్యాప్త యుద్ధానికి తెరతీశారు. అన్ని రాష్ట్రాలను కూడగట్టుకొని ఉద్యమం చేపట్టాలని డిసైడ్ అయ్యారు. అంటే.. కేసీఆర్ చేస్తున్న ఆలోచనలు రాను రాను తెలంగాణ రాష్ట్రానికి నష్టం తేనున్నాయా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంతో కయ్యానికి దిగితే నిధులు ఎలా వస్తాయనే విషయం కేసీఆర్‌కు తెలియదా..?
Also Read: మూడేళ్ల తర్వాత పోలీసులతో కేసీఆర్ భేటీ.. అందుకేనా?
మొన్నటికి మొన్న రాజకీయాల్లోకి వచ్చిన జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు భేష్ అనాలా..? కేంద్రంతో కయ్యం పెట్టుకుంటున్న కేసీఆర్‌ను మెచ్చుకోవాలా..? అంటే ఏదీ అర్థం కాకుండానే ఉంది. జగన్ వినియోగిస్తున్న స్ట్రాటజీని కేసీఆర్ ఎందుకు ఫాలో కావడం లేదని పలువురి మదిలో మెదులుతున్న ప్రశ్నకేంద్రంతో కయ్యం.. ఎవరికి నష్టం.?