https://oktelugu.com/

భారత్ ఐటీకి దెబ్బ: హెచ్1బీ వీసా కలిగిన టెకీలకు ట్రంప్ షాక్?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి పొందడమే పరమావధిగా విదేశీయులకు కల్లెం వేస్తూ అమెరికన్ల మనసు దోచుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ కొరఢా ఝలిపిస్తున్నారు.ఈ క్రమంలోనే మరోసారి వీసాదారులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. హెచ్1 బీ వీసాలను పరిమితం చేసేందుకు ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దేశానికి చట్టబద్దమైన వలసలను అరికట్టడం.. స్థానికీకరణ.. అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు మంగళవారం తాత్కాలిక ఉత్తర్వులను ట్రంప్ చేశారు. Also Read: ట్రంపా.. మజాకా.. వైట్ హౌజ్ మొత్తం అటించేశాడుగా? ట్రంప్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2020 / 12:55 PM IST
    Follow us on

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి పొందడమే పరమావధిగా విదేశీయులకు కల్లెం వేస్తూ అమెరికన్ల మనసు దోచుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ కొరఢా ఝలిపిస్తున్నారు.ఈ క్రమంలోనే మరోసారి వీసాదారులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. హెచ్1 బీ వీసాలను పరిమితం చేసేందుకు ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దేశానికి చట్టబద్దమైన వలసలను అరికట్టడం.. స్థానికీకరణ.. అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు మంగళవారం తాత్కాలిక ఉత్తర్వులను ట్రంప్ చేశారు.

    Also Read: ట్రంపా.. మజాకా.. వైట్ హౌజ్ మొత్తం అటించేశాడుగా?

    ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో హెచ్1బీ వీసాల పిటీషన్లలో మూడో వంతు ప్రభావం అవుతుందని.. ముఖ్యంగా ఈ వీసాలపై ఎక్కువగా అమెరికాకు వెళ్లే భారతీయ టెకీ నిపుణులకు తీవ్ర నష్టం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ తాజా రూల్ హెచ్1 బీ వీసా ఉద్యోగాలను కనీస వేతన స్థాయిలను కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం.

    ట్రంప్ ఉత్తర్వులతో అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విషయంలో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్.ఎస్) రంగంలోకి దిగింది. హెచ్1బీ వీసాకు సంబంధించి గత 20 ఏళ్లలో చేసిన ముఖ్యమైన సంస్కరణ ఇది అని లేబర్ డిప్యూటీ సెక్రటరీ ప్యాట్రిక్ తెలిపారు. ఈ ఆంక్షలు గురువారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

    Also Read: కేంద్రం అలర్ట్.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి..!

    ఇది భారతీయ టెక్ నిపుణులు.. టెక్ సంస్థలను భారీగా ప్రభావితం చేస్తుందని.. హెచ్1బీ వీసా పొందడం మరింత కఠినం చేస్తుందని భారత ఐటీ పరిశ్రమలు.. ఐటీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.