బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 ఎంతగానో అలరిస్తోంది. గత నాలుగు వారాలుగా కొనసాగుతున్న బిగ్ బాస్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అవినాష్.. అరియానా.. దెత్తడి హారిక, అమ్మరాజశేఖర్ మధ్య సాగిన సీన్స్ హైలెట్ గా నిలిచాయి.
Also Read: నందు-గీతా మధ్యలో చిచ్చుపెట్టిన రష్మి.. నిజమేనా?
ఎప్పటిలాగే బిగ్ బాస్ కంటెస్టులకు ఒక్కో టాస్క్ ఇచ్చాడు. యువరాణిగా అరియానా గ్లోరి.. ఆమె తల్లిగా గంగవ్వ నటించారు. వీరు ఓ హోటల్ కు వెళ్లగా వీరి నుంచి టిప్స్.. స్టార్స్ మిగతా కంటెస్టులు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో మేనేజర్‌గా వ్యవహరిస్తున్న అవినాష్‌కు బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు.
సీక్రెట్ టాస్క్ ప్రకారం హోటల్ సిబ్బంది చేసే పనులకు, అలాగే అతిథులకు ఇబ్బంది కలిగించేలా అవినాష్ ప్రవర్తించాలని బిగ్‌బాస్ సూచించాడు. అరియానాతో బీబీ హోటల్‌లోకి అతిథులుగా వచ్చిన సోహైల్, మెహబూబ్, హారిక, గంగవ్వలను అవినాష్ చికాకు పెడుతుంటాడు. ఈక్రమంలో ఆర్డర్ ఇస్తుంటూ పట్టించుకోకుండా అవినాష్ అరియానా కోసం వెళ్లడంపై హారిక భగ్గుమన్నది. హారికను అవినాష్ తన మాటలతో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’కు అంత ఓకే.. రాజమౌళిపై బాలీవుడ్ భామ చిన్నచూపు?
ఇక అవినాష్ తన చిలిపిచేష్టలతో అరియానాను చికాకుపెట్టించాడు. అరియానా సైతం అవినాష్ ను ఓ ఆటఆడేసుకుంది. యువరాణిగా అరియానా ఓ బకెట్ తెప్పించి స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లను చెంచాతో నింపాలని అవినాష్‌ను ఆదేశించింది. దీంతో తప్పక చెంచాతో బకెట్‌లో నీళ్లు నింపే కార్యక్రమాన్ని పెట్టుకొన్నాడు. అదేవిధంగా అతిథుల కోసం మిమిక్రీ చేస్తూ కనిపించాడు. అంతేకాకుండా తనను అవినాష్ ముద్దుపెట్టుకున్నాడంటూ రచ్చరచ్చ చేసింది. ఇదంతా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.