https://oktelugu.com/

కత్తి మహేశ్ కు 17లక్షలిచ్చిన ఏపీ ప్రభుత్వం

నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. రూ. 17 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెన్నైలోని అపోలో ఆస్పత్రికి జమ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లురు జిల్లాలో వారం రోజుల క్రితం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 2, 2021 / 04:11 PM IST
    Follow us on

    నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. రూ. 17 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెన్నైలోని అపోలో ఆస్పత్రికి జమ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

    నెల్లురు జిల్లాలో వారం రోజుల క్రితం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు తెలిసింది.

    కత్తి మహేష్ ను ఆయన స్నేహితులు అయిన సినిమా రంగానికి చెందిన దర్శకుడు సాయి రాజేశ్, ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డిలు దగ్గరుండి చూసుకుంటున్నారు. మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ వారు వెల్లడించినట్టు తెలిసింది. కత్తి మహేష్ కంటికి గాయమైందని..పలు శస్త్రచికిత్సలు చేశారని.. ప్రాణాపాయం ఏమీ లేదని తెలిసింది.

    గత కొంతకాలంగా జనసేన, టీడీపీలను విమర్శిస్తూ వైసీపీకి మద్దతుగా కత్తి మహేష్ రాజకీయం చేస్తున్నారు. పలు వైసీపీ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ కు ఏపీ ప్రభుత్వం ఈసాయం అందించినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా చంద్రబాబు, పవన్ పై విమర్శలు చేస్తూ వైసీపీ నేతగా మసలుకుంటున్న కత్తికి ఏపీ ప్రభుత్వం ఈసాయం చేసి ఆదుకుంది. ఈ దళిత జర్నలిస్టు కోణంలోనూ ఈ సాయం చేసినట్టు తెలుస్తోంది.