https://oktelugu.com/

ఎంపీ Vs ఎమ్మెల్యే! మరోసారి వివాదం షురూ..!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైసీపీ నాయకుల మధ్య మరోసారి వార్ షురూ అయ్యింది. ఇందుకు కారణం లేకపోలేదు… ఎంపీ రాఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. దీంతో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఎంపీపై అదే స్థాయిలో విమర్శలకు దిగారు. ఇరువురి విమర్శలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించేదిగా ఉంది. Also Read: ఈశ్వరయ్య వ్యవహారంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పవా? ఎంపీ రఘురామ కృష్ణంరాజు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 14, 2020 / 12:41 PM IST
    Follow us on


    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైసీపీ నాయకుల మధ్య మరోసారి వార్ షురూ అయ్యింది. ఇందుకు కారణం లేకపోలేదు… ఎంపీ రాఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. దీంతో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఎంపీపై అదే స్థాయిలో విమర్శలకు దిగారు. ఇరువురి విమర్శలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించేదిగా ఉంది.

    Also Read: ఈశ్వరయ్య వ్యవహారంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పవా?

    ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియా ముఖంగా సిఎం జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రంలో రెడ్డి రాజ్యం కొనసాగుతుందని, ఆ సామాజిక వర్గానికే ప్రాధాన్యత దక్కుతుందని, అన్ని కులాలతో ఓటు వేయించుకుని రెడ్డి కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టబెడుతున్నారని ఇది సరైన విధానం కాదని సూచించారు. ప్రతి రెండు రోజులకు ఒక రెడ్డి సామాజికి వర్గానికి చెందిన వారికి ప్రభుత్వ పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు విడుదల అవుతున్నాయని ఆరోపించారు. క్రైస్తవుడైన జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కుతుందని ప్రజలు భావించినట్లు తెలిపారు. రాఘురామ కృష్ణంరాజు సిఎం జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవుడు అని కొద్ది రోజుల నుంచి పదే పదే చెప్పేందుకు ప్రయత్నం చేస్తుండటం విశేషం. అదేవిధంగా రాష్ట్రంలో అర్హత లేని వారికి ప్రభుత్వ పదువులు కట్టబెడుతున్నారని, ఇతర కులాలు లేవని ప్రభుత్వం భావిస్తుందా అని ప్రశ్నించారు.

    Also Read:చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

    దీంతో వైసీపీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజులకు అత్యధిక పదవులు వైసీపీ ఇచ్చిందని చెప్పారు. ఎంపీ రాజు తేడా అనే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తూ, ఆతనికి మతి స్థిమితం లేదన్నారు. గతంలో యాదవులు, కాపులు, దళితులు అందరి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ అధినాయకుణ్నే వెన్నుపోటు పోడుస్తున్నారని విమర్శించారు. ఎంపీ వల్ల క్షత్రియ సామాజిక వర్గం తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పారు. గతంలో బాపిరాజు, శివరామరాజు, కృష్ణంరాజు వంటి వారు ఎన్ని పదవులు అలంకరించినా హుందాగా ప్రవర్తించే వారన్నారు. నర్సాపురం ఎంపీ క్షత్రియుల పరువు మంటగలుపుతున్నారని తెలిపారు, వారే రాఘురామ కృష్ణంరాజును వెలివేస్తారని చెప్పారు. టీడీపీ పాలనాలో ఏం చేశావని ప్రశ్నించారు. ఈ వివాదం పార్టీలో మరింత దుమారం రేపేదిగా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.