https://oktelugu.com/

Modi Will Taste Yadamma Cooking: మాస్టర్‌ షెఫ్‌లకే పాఠం చెబుతున్న యాదమ్మ.. మోదీకి కరీంనగర్‌ వంటలు!

Modi Will Taste Yadamma Cooking: తెలంగాణలో కరీనగర్‌ ఉద్యమాలకు పురిటిగడ్డ.. పోరాటానికి స్ఫూర్తి.. అణచివేతపై తిరుగుబాటు గుర్తొస్తుంది. ఇలాంటి జిల్లా వంటకాలను ప్రధాని నరేంద్రమోదీ రుచి చూడనున్నారు. హైదరాబాద్‌లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న ప్రధానితోపాటు బీజేపీ ముఖ్య నేతలందరికీ కరీంనగర్‌ వంటకాలు రుచి చూపించేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు కరీంనగర్‌కు చెందిన యాదమ్మను బండి సంజయ్‌ హైదరాబాద్‌కు పలిపించారు. నోవాటెల్, హెచ్‌ఐసీసీతోపాటు నగరంలోని ప్రముఖ మాస్టర్‌ షెఫ్‌లను […]

Written By: Sekhar Katiki, Updated On : June 30, 2022 1:33 pm
Follow us on

Modi Will Taste Yadamma Cooking: తెలంగాణలో కరీనగర్‌ ఉద్యమాలకు పురిటిగడ్డ.. పోరాటానికి స్ఫూర్తి.. అణచివేతపై తిరుగుబాటు గుర్తొస్తుంది. ఇలాంటి జిల్లా వంటకాలను ప్రధాని నరేంద్రమోదీ రుచి చూడనున్నారు. హైదరాబాద్‌లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న ప్రధానితోపాటు బీజేపీ ముఖ్య నేతలందరికీ కరీంనగర్‌ వంటకాలు రుచి చూపించేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు కరీంనగర్‌కు చెందిన యాదమ్మను బండి సంజయ్‌ హైదరాబాద్‌కు పలిపించారు. నోవాటెల్, హెచ్‌ఐసీసీతోపాటు నగరంలోని ప్రముఖ మాస్టర్‌ షెఫ్‌లను పిలిపించుకుని వారికి యాదమ్మతో వంటకాలపై అవగాహన కల్పిస్తున్నారు.

Modi Will Taste Yadamma Cooking

Modi Will Taste Yadamma Cooking

 

ఘుమఘుమలాడనున్న తెలంగాణ రుచులు..
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. జులై 2, 3 తేదీల్లో జరిగే సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. దీంతో ఆ సమావేశాలను తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వీరందరికీ తెలంగాణ సంప్రదాయ రుచులు రుచి చూపించాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ స్పెషల్‌ వంటకాలను ఏరికోరి మెనూలో చేర్చారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి తెలంగాణ రుచులు చూపించాలని బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను అనే మహిళను హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

Also Read: India Corona: లక్షకు పైగా యాక్టివ్ కేసులు.. కరోనా దేశాన్ని కమ్మేస్తోందా?

ఎవరీ యాదమ్మ..
వంటకాల్లో చేయితిరిగిన నలభీములు ఉన్న హైదరాబాద్‌ నగరంలోని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వంటలు చేయడానికి అనూహ్యంగా కరీంనగర్‌కు చెందిన యాదమ్మ ఎంపికైంది. దీంతో ఇప్పుడు నెటిజన్లు వెరీ యాదమ్మ అని ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. అసలు ఎవరీ యాదమ్మ…గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ మహిళకు ఏకంగా దేశ ప్రధానికే వంటచేసి పెట్టే అవకాశం ఎలా వచ్చింది? అనే వివరాలు సేకరిస్తున్నారు. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన యాదమ్మకు 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో మెట్టినింటికి చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. 29 ఏళ్లుగా వంట వృత్తినే జీవనాధారం చేసుకుంది.

శాకాహారంలో స్పెషలిస్ట్‌..
సాధారణంగా తెలంగాణ వంటకాలు అంటే నీచు లేకుండా ఉండదు. మటన్, చికన్, చేపలు కచ్చితంగా ఉంటాయి. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాత్రం శాకాహార వంటకాలు చేయించాలని పార్టీ రాష్ట్ర నేతలు నిర్ణయించారు. ఈమేరకు శాకాహార వంటకాల్లో స్పెషలిస్టు అయిన యాదమ్మను ఎంపిక చేశారు. యాదమ్మ చేసే వంటకాలు తిన్నవారు ఎవరైనా ఆహా అనకుండా ఉండలేరు. ఒకేసారి 10 వేల మందికి కూడా వండివార్చే నేర్పరితనం ఆమె సొంతం. దీంతో పెద్ద సభలు, భారీ కార్యక్రమాలకు చాలామంది ఆమెనే పిలుస్తుంటారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌ పాల్గొనే కార్యక్రమాల్లోనూ యాదమ్మే వంటలు చేస్తుంటుంది.

Modi Will Taste Yadamma Cooking

Yadamma

ఆమె వంటలు ‘బండి’కి ఎంతో ఇష్టం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా యాదమ్మ వంటలంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యాదమ్మతో వంటలు చేయించాలని నిర్ణయించారు. ఆయన నుంచి పిలుపు అందిన వెంటనే యాదమ్మ హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌కి వస్తున్న మోదీ సారుకి నువ్వే వంటలు చేయాలని చెప్పడంతో యాదమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ‘మోదీ సారు ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు కావాలని అడగడంతో సంజయ్‌ సారు నన్ను హైదరాబాద్‌కి పిలిపించారు’ అని యాదమ్మ చెబుతోంది.

మోదీ కోసం స్పెషల్‌ వంటకాలు..
ప్రధాని నరేంద్రమోదీ పూర్తిగా శాఖాహారి. దీంతో ఆయన కోసం తెలంగాణలో ప్రత్యేకమైన శాఖాహార వంటకాలు పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార తో పాటు గుత్తి వంకాయ, పచ్చిపులుసు, గంగవాయిలి కూర పప్పు, సాంబారు మొదలైన వంటకాలు వండేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు పప్పు గారెలు, సకినాలు, అరిసెలు, పాయసం, సర్వపిండి, భక్షాలు కూడా తయారుచేయనున్నట్లు చెబుతోంది. ‘మోదీ సారు తన వంట తింటే అంతకంటే భాగ్యం ఏముంటుంది’ అని యాదమ్మ ఆనందంలో మునిగితేలుతోంది.

Also Read:Chandrababu Naidu: చంద్రబాబు పార్టీ నడవడానికి కోట్లు ఇస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరో తెలుసా?

Tags