AB Venkateswararao: పాలనా వ్యవస్థలో ఐఏఎస్, ఐపీఎస్ లది కీలక పాత్ర. సివిల్ సర్వీసు అంటే అదో అత్యున్నత స్థానం. కానీ ఇదంతా గతం. ఎంతటి వారైనా కాంతదాసులే అన్నట్టు అధికారం ముందు వారూ మోకరిల్లాల్సి వస్తోంది. లేకుంటే సర్వీసులో ఉన్నా లేనట్టే.జీవితాంతం సర్వీసు అందించే అధికార గణం.. ఐదేళ్లు అధికారంలో ఉండే నాయకులకు జీ హుజూర్ అనాల్సిందే. ముస్సోరిలో శిక్షణలో నేర్చుకున్న నైతిక విలువలు, నిబద్ధత వదులుకోవాల్సిందే. పాతికేళ్ల కింద నేర్చిన విలువలు పదవీవిరమణ సమయానికి వచ్చేసరికి నేతల ముందు తాకట్టు పెట్టాల్సిందే. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు ఐఏస్ లు, ఐపీఎస్ లు సొంత వ్యవస్థలనే భ్రష్టు పట్టిస్తున్నారు. నిలువునా పాతరేస్తున్నారు. కఠినంగా వ్యవహరించే సహచర అధికారులపైనే రాజకీయ ఒత్తిళ్లతో వెంటాడుతున్నారు. వేటు వేస్తున్నారు.
నచ్చని అధికారి కావడంతో..
ఏపీలో డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ తో వ్యవస్థల తీరు చర్చనీయాంశమైంది. రాజకీయ అధికారం చేతిలో సివిల్ సర్వీసుల వెన్నెముక విరిగిపోయిందని మరోసారి తేటతెల్లమైంది. అయితే ఇందుకు బాధ్యులు మాత్రం ముమ్మాటికీ సివిల్ సర్వీసు చదివిన అధికారులే. ఈ రోజు వైసీపీ సర్కారుకు నచ్చలేదని.. ఏబీ వెంకటేశ్వరరావును వెంటాడుతున్నారు. రేపు పొద్దున ప్రభుత్వం మారితే వారికి నచ్చని మరో పది మందిని వారూ వెంటాడుతారు. ఫలితం బలైపోయింది మాత్రం అధికార గణం మాత్రమే. పాలనాపరమైన అంశాల్లో ఇండియన్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భారత రాజ్యాంగం ఎన్నోహక్కులను కల్పించింది. పారదర్శక విధులను అప్పగించింది. అవన్నీ వదిలి రాజకీయ అధికారం ముందు మొకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవస్థలు భ్రష్టు పట్టడానికి వాటిని అమలు చేస్తున్న అధికారులే కారణమవుతున్నారు. తమ కళ్లను తామే పొడుచుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ముందు చులకన అవుతున్నారు.
Also Read: Modi Will Taste Yadamma Cooking: మాస్టర్ షెఫ్‌లకే పాఠం చెబుతున్న యాదమ్మ.. మోదీకి కరీంనగర్ వంటలు!
వెంటాడుతున్న సర్కారు..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావును వెంటాడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక విభాగంలో పనిచేయడమే ఆయన చేసిన పాపం. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక విధానాలు, రుణాలు పొందడంలో లూప్ హోల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావుతో పోలిస్తే వీరికి భవిష్యత్ లో అపాయం ఉన్నట్టే కదా. అత్యున్నత న్యాయస్థానం తీర్పును సైతం అపహాస్యం చేసేలా రెండు సార్లు పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి సహేతుకమైన కారణాలు చూపకుండా.. మరోసారి సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల కోర్టు తీర్పుతో ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగాధిపతిగా నియమించారు. ఆయన బాధ్యతలు సైతం స్వీకరించారు. అటు వెంకటేశ్వరరావు తాను మాట్లాడనంటూనే తనలాంటి వ్యక్తులు సుప్రీంకోర్టు దాకా వెళ్లి న్యాయ పోరాటం చేయాల్సి వచ్చందని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వానికి ఆయనపై చిర్రొత్తుకొచ్చింది. సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తున్నారంటూ మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది.
సహేతుక కారణాలేనా?
వాస్తవాని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించిన మాటలేమిటి? సస్పెన్షన్ కు చెబుతున్న కారణాలేంటి? అన్న విషయం ప్రభుత్వానికే తెలియాలి. అవినీతి కేసుల్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు మాత్రం కేసులు గురించి ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు. కీలక నేత కుటుంబసభ్యుడి హత్యకేసులో నిందితులు ఏమైనా వ్యాఖ్యలు చేయవచ్చు. కానీ ఒక ఐఏఎస్ అధికారి మాత్రం తనకు జరిగిన అన్యాయం గురించి వ్యాఖ్యానిస్తే మాత్రం ఏకంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఇక్కడ పురమాయించింది రాజకీయ నేతలే కావొచ్చు.. కానీ అమలు చేసింది మాత్రం ఏబీ వెంకటేశ్వరరావులాంటి ఐపీఎస్ అన్నది మాత్రం యధార్థం. అట్టా ఉంది మన ఇండియన్ ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ.
Also Read: India-China: భారత్ చైనా ను ఢీకొట్టాలంటే ఏం చేయాలో తెలుసా