India Corona: కరోనా మహమ్మారి మరోమారు పడగవిప్పుతోంది. రోజువారి కేసులు పెరుగుతున్నాయి. గతంలో మాదిరి కఠిన ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దేశంలో ప్రమాదకర స్థాయిలో కేసులు వెలుగు చూడటంతో మునుపటి పరిస్థితి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ తన పడగ విప్పడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజా పరిస్థితితో దేశం యావత్తు గందరగోళంలో పడుతోంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా దాటడంతో గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీనిపై ప్రజల్లో కూడా దడ మొదలైంది.
బుధవారం ఒక్కరోజే 18 వేలకు పైగా కేసులు బయటపడటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది. దీంతో నాలుగో దశ ప్రారంభమైందని ఇప్పటికే నిపుణులు సూచిస్తుండటంతో వైరస్ విజృంభిస్తుందని తెలుస్తోంది. కేరళ, మహారాష్ట్రల్లోనే 8 వేలకు పైగా కేసులు రావడంతో బెంబేలెత్తిపోతున్నారు. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు బయట పడటం తెలిసిందే. దీంతో కరోనా మహమ్మారి మరోమారు తన పడగ విప్పుతోందని చెబుతున్నారు.
Also Read: India-China: భారత్ చైనా ను ఢీకొట్టాలంటే ఏం చేయాలో తెలుసా
మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో జనంలో టెన్షన్ మొదలైంది. వైరస్ ధాటికి బలైపోతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. మొదటి, రెండో, మూడో విడతల్లో కలిగిన నష్టంతో ప్రస్తుతం నాలుగో దశలో కూడా నష్టాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూన్ లో కరోనా నాలుగో దశ వస్తుందని హెచ్చరికలు చేసిన సందర్భంలో ఇప్పుడు అవే ఛాయలు కనిపిస్తుండటం సహజమే. కానీ కరోనా ముప్పును తొలగించుకునే క్రమంలో ఏం చర్యలు తీసుకోవాలనేది అంతుచిక్కని ప్రశ్నే.
వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతున్నా వైరస్ దాడి మాత్రం ఆగడం లేదు. ఫలితంగా వేలాది మంది బాధితులు అవుతున్నారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని గతంలోనే ప్రకటించినందున ఇప్పుడు అదే సందర్భం మనకు కనిపిస్తోంది. ఇంకా ఎన్ని రకాలుగా కరోనా వైరస్ ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. మొత్తానికి దేశంలో కరోనా వైరస్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read:Chandrababu Naidu: చంద్రబాబు పార్టీ నడవడానికి కోట్లు ఇస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరో తెలుసా?