Ram Gopal Varma: కాంట్రవర్సీ కామెంట్స్ కు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియా వేదికగా సినీ, పొలిటికల్ కామెంట్స్ తో కాక రేపడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. మొన్నటికి మొన్న పోర్న్ వీడియో తరహాలో వీక్షకులకు నయానానందం కల్పించారు. ఇప్పుడు ఏకంగా రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యానించారు. సినీ, పొలిటికల్ అంశాలతో పాటు ప్రముఖులపై సెటైరికల్ కామెంట్స్ చేసే వర్మ ఇప్పుడు చంద్రబాబు, పవన్ ల భేటీపై తాజాగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ను టార్గెట్ చేసుకొని అధికార వైసీపీకి అనుకూలంగా సినిమా తీస్తారని ప్రచారం సాగింది. ఈ సినిమా నిర్మిస్తున్న వ్యక్తికి జగన్ సర్కారు టీటీడీ బోర్డు మెంబరుగా కూడా గౌరవించింది. మొన్న ఆ మధ్య సీఎం జగన్ నేరుగా వెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో కలిసి వచ్చారు వర్మ. కానీ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. నెలల వ్యవధిలో సినిమా తీసే అనుభవం ఉండడం కాబోలు కాస్తా రిలాక్స్ గా ఉన్న వర్మ.. ఇప్పుడు పవన్, చంద్రబాబుల భేటీపై బాంబు పేల్చారు. ఒక కులంపై విపరీత వ్యాఖ్యానం చేసి సైలెంట్ గా గమనించడం మొదలుపెట్టారు.

సున్నితమైన అంశాలపై ఘాటైన కామెంట్స్ చేసి జఠిలం చేయడం వర్మకు తెలిసినంతగా.. మరెవరికీ తెలియదు. పచ్చగడ్డిని సైతం మండించేలా చేయడం వర్మ స్టైల్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ భేటీపై రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. డబ్బు కోసం కాపులను కమ్మ వాళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. రిప్ కాపులు, కంగ్రాట్స్ కమ్మ వాళ్ళు” అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లోనే కాక అటు కాపు, కమ్మ కులాల్లోనూ దుమారానికి కారణం అయ్యాయి. నిత్యం సంచలనాలు రేకెత్తించే కామెంట్స్ చేసే వర్మ ఈ సారి రాజకీయంగా, కులాలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది.
వర్మ తాజా ట్విట్ పై కాపు సంఘాలు రియాక్టయ్యాయి. కాపు సంఘాల జేఏసీ నేతలు విజయవాడలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. వర్మ వ్యాఖ్యలను ఖండించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని కాపు నేతలు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం బూతులతో వ్యాఖ్యలు చేసే వర్మ, రాజకీయాలకు సంబంధించిన విషయాలను, రెండు కులాలకు ఆపాదించి చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, వర్మ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించారు. వర్మ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకొని, వరుసగా వివాదాలకు కేంద్రం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నితమయిన అంశాలను రెచ్చగొట్టే విదంగా వ్యవహరించిన వర్మ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

వర్మ వివాదాస్పద కామెంట్స్ వెనుక అధికార పార్టీ హస్తం ఉందని కాపులు, కాపు సామాజికవర్గాల ప్రతినిధులు అనుమానిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో కాపులు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కాపుల మధ్య చీలిక తెచ్చేందుకు వైసీపీ అన్నిరకాల ప్రయత్నాలు చేసింది. అటు వైసీపీ లోని కాపు నేతలు వరుసగా సమావేశాలు సైతం నిర్వహించారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. కాపులు పవన్ వైపు సంఘటితమవుతున్న నేపథ్యంలో వర్మలాంటి వివాదాస్పద వ్యక్తులను తెచ్చి ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ వెనుక ఉన్నది ముమ్మాటికీ వైసీపీనేని ఆరోపిస్తున్నారు. దీనికి మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు కూడా వరుసగా స్పందిస్తున్నారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ గట్టిగానే రియాక్టయ్యారు. కామంతో కాళ్లు నాకావ్ అనుకున్నా కానీ పే టీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదనిన కామెంట్స్ చేశారు. RIP ఆర్జీవీ, కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ రీ ట్వీట్ తో రిప్లై ఇచ్చారు.