Kapil Sibal: న్యాయవాదుల్లో పట్టు నిలుపుకున్న కపిల్ సిబల్!

సుప్రీం కోర్టు బార్‌ అధ్యక్షుడిగా కపిల్‌ సిబల్‌ ఎన్నిక కావడం ఇది నాలుగో సారి. 1996–96, 1997–98, 2001–02 సంవత్సరాల్లో సిబల్‌ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా 2024–25 సంవత్సరానికి మరోమారు ఎన్నికయ్యారు.

Written By: Raj Shekar, Updated On : May 17, 2024 11:21 am

Kapil Sibal

Follow us on

Kapil Sibal: సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ ఎన్నికయ్యారు. గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల్లో సిబల్‌ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 1066 ఓట్లు వచ్చాయి. సమీప అభ్యర్థి, సీనియర్‌ న్యాయవాది ప్రదీప్‌ రాయ్‌కు 689 ఓట్లు వచ్చాయి. దీంతో కపిల్‌ సిబల్‌ విజయం సాధించినట్లు ప్రకటించారు.

నాలుగోసారి ఎన్నిక..
సుప్రీం కోర్టు బార్‌ అధ్యక్షుడిగా కపిల్‌ సిబల్‌ ఎన్నిక కావడం ఇది నాలుగో సారి. 1996–96, 1997–98, 2001–02 సంవత్సరాల్లో సిబల్‌ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా 2024–25 సంవత్సరానికి మరోమారు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఆరుగురు పోటీపడ్డారు. ప్రస్తుత అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది డాక్టర్‌ ఆదిష్‌ సి. అగర్వాల్‌కు కేవలం 296 ఓట్లు మాత్రమే వచ్చాయి. విజయం సిబల్‌ను వరించింది.

అభినందనలు..
సుప్రీం కోర్టు బార్‌ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సిబల్‌ ఎన్నిక కావడంపై ఆ పార్టీ నాయకుడు జైరాం రమేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉదారవాద, లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులకు ఇది భారీ విజయమని వ్యాఖ్యానించారు. ప్రధాని పదవి నుంచి దిగిపోనున్న మోదీకి ఇది ట్రైలర్‌ అని పేర్కొన్నారు. త్వరలో జాతీయస్థాయిలో మార్పులు జరుగుతాయని వ్యాఖ్యానించారు.

హార్వర్డ్‌ లా స్కూల్‌లో సిబల్‌ గ్రాడ్యుయేషన్‌..
ఇలా ఉండగా కపిల్‌ సిబల్‌ హార్వర్డ్‌ లా స్కూల్‌లో గ్రాడ్యుయుషన్‌ చేశారు. 983లో సీనియర్‌ న్యాయవాదిగా సేవలు అందించారు. 1989–90లో భారత అడిషనల్‌ సొలిసిటలర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కపిల్‌ గతంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.