Ravi Teja: సినిమా ఇండస్ట్రీకి సోలోగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ తనకంటూ ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి లాంటి మూడు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో హ్యాట్రిక్ హిట్లు అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ డమ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.
ఇక రవితేజ వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ ని అందుకుంటున్న సమయంలోనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లుఅర్జున్ లాంటి వారు సక్సెస్ లను సాధిస్తున్నారు. మరి అలాంటి హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. మరి రవితేజ మాత్రం ఎందుకు టైర్ టు హీరోగానే మిగిలిపోయాడు అనే అనుమానాలు మనందరిలో కలుగుతాయి. నిజానికి రవితేజ అలా మిగిలిపోవడానికి గల కారణం ఏంటి అంటే హిట్టు ప్లాప్ తో సంబందం లేకుండా ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక తన మార్కెట్ గురించి ఆలోచించకుండా ఎంత బడ్జెట్ అయినా సరే సినిమాలు చేస్తూ అందులో కొన్ని సక్సెస్ లు సాధిస్తే, మరి కొన్ని ఫెయిల్యూర్స్ ని అందుకున్న కూడా ఆయన ముందుకు కదిలాడు.
కాబట్టి ఆయన ఈరోజు స్టార్ హీరోలు అనుభవిస్తున్న స్టార్ స్టేటస్ ను అనుభవించలేకపోతున్నాడు. నిజానికి ఇప్పుడున్న హీరోలందరికంటే కూడా రవితేజకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ కానీ ఆయన ఎంత సేపు రొటీన్ సినిమాలు చేస్తూ తన అభిమానులను కాపాడుకుంటూ వచ్చాడు తప్ప కొత్తగా అభిమానులైతే సంపాదించుకోలేకపోయాడు. అలాగే క్యారెక్టర్స్ పరంగా వెరియేషన్స్ చూపించే క్యారెక్టర్స్ చేయలేదు.
అలాగే ఆయన లుక్ ని కూడా అన్ని సినిమాల్లో ఒకే విధంగా ఉండేలా చూసుకున్నాడు. తప్ప కొత్తగా ఉండే విధంగా అయితే ప్లాన్ చేసుకోలేకపోయాడు. దానివల్లే ఆయన ఈరోజు స్టార్ హీరోలు అనుభవిస్తున్న స్టార్ స్టేటస్ ను అనుభవించలేకపోతున్నాడు… ఇక మొత్తానికైతే రవితేజ కి కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉండటం ఒక రకంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…