Rashmika Mandanna: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం సాగుతోంది. మే 20న ఐదో విడత ఎన్నికలు జరుగునున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, లఢక్‌లో మొత్తం 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ విడతలో అమేథీ నుంచి స్మృతి ఇరానీ, రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, బారాముల్ల నుంచి ఒమర్ అబ్దుల్లా భవితవ్యం తెలనుంది.
రష్మిక వీడియో..
అటల్ సేత వంతెనై రష్మిక ఓ షార్ట్ వీడియో షూట్ చేశారు. దీనిని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. వీడియోలో ‘భారత్.. ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరని, అసాధ్యం అనుకున్న దాన్ని ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం చేశారు. ఈ వంతెనపై ప్రయాణం ఓ మధురానుభూతిని ఇస్తుంది. వికసిత్ భారత్‌కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోంది. యంగ్ ఇండియా.. అన్ స్టాపబుల్ డెవలప్మెంట్ సాధిస్తోందనడానికి ఇదే నిదర్శనమిది. ఇలాంటి అటల్ సేతులను ఇంకా చాలా కావాలి. అందుకోసం ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేయండి’ అని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల వేళ వీడియో వైరల్..
జాతీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా, స్టార్ హీరోయిన్, శ్రీవల్లిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న చేసిన ఓ షార్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో నిర్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రాన్స్ హార్బర్ లింగ్ బ్రిడ్జికి సంబంధించి రష్మిక వీడియ చేశారు. భారత్‌లో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జి ఇదే. ముంబైలోని సేవ్రీ నుంచి నౌవాను కనెక్ట్ చేస్తూ నిర్మించారు. 22 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను ఏడేళ్లలో కేంద్రం నిర్మించింది. వంతెన నిర్మాణానికి ముందు రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 2 గంటలు పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ వంతెన వడాలా, కోలాబా, ముంబై పోర్టు వంటి ప్రాంతాలను కనెక్ట్ చేస్తుంది.
వీడియోపై స్పందించిన మోదీ..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక వీడియోపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. రష్మిక వీడియోను మోదీ తన అధికారిక వీడియోలో రీ ట్వీట్ చేశారు. ‘దేశ ప్రజలతో అనుబంధాన్ని కలిగి ఉండడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి మించిన సంతృప్తి మరొకటి ఉండదు’ అని క్యాప్షన్ ఇచ్చారు.
South India to North India… West India to East India… Connecting people, connecting hearts! #MyIndia pic.twitter.com/nma43rN3hM
— Rashmika Mandanna (@iamRashmika) May 16, 2024