Kaleshwaram Project: తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.1.20 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎప్పుడు సభలు, సమావేశాలు జరిగినా ముఖ్యమంత్రితోపాటు తెలంగాణ మంత్రులు, ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. తాజా పరిస్థితి చూస్తే కాళేశ్వరం కథ కంచికి పోతున్నట్లే కనిపిస్తోంది. ఇటీవలి భారీ వరదకు ప్రాజెక్టులోని భారీ మోటార్లు నీట మునిగాయి. వాటిపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదు. ఇంతలోనే కేంద్రం కాళేశ్వరంపై మరో బాబు బేల్చింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అర్హత కూడా లేదని ప్రకటించింది. ఫైనాన్స్ క్లియరెన్స్ లేకపోవడంతో ప్రాజెక్టును జాతీయ హోదా జాబితాలో చేర్చలేదని స్పష్టం చేసింది.

గులాబీ ప్రచారాస్త్రంగా ‘కాళేశ్వరం’
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రచారాస్త్రంగా మారింది. 2018 ఎన్నికల నాటికే ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణం హడావుడిగా పూర్తి చేయించిన కేసీఆర్ తాను మళ్లీ గెలిస్తేనే మిగతా నిర్మాణం పూర్తవుతుందని లేకుంటే మళ్లీ ఆంధ్రుల చేతుల్లోకి వెళ్లి నిర్మాణం ఆగిపోతుందని ప్రచారం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. తర్వాత కొంత మేరకు పనులు చేయించి నీటì ఎత్తిపోతలు షురూ చేశారు.
Also Read: Draupadi Murmu Biography: మారుమూల గ్రామం నుంచి రాష్ట్రపతి దాకా
అటు ఎత్తుడు.. ఇటు దించుడు..
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా తెలంగగాణ ప్రభుత్వం నేసనల్ జియోగ్రాఫిక్ చానల్‌లలో ఓ డాక్యుమెంటరీ కూడా ప్రసారం చేయించుకుంది. కానీ ప్రాజెక్టులోల భారీ అవినీతి జరిగిందని, అంచనాలు భారీగా పెంచి దోచుకున్నారని జేఏసీ నాయకులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జేఏసీ అయితే అవినీతి, అక్రమాలపై ఒక పుస్తకమే ప్రచురించింది. ఇకపోతే కాళేశ్వరం నుంచి రెండు సార్లు నీటిని లిఫ్ట్ చేసిన అధికారులు వర్షాలు రాగానే వాటిని కిందకు వదిలేశారు. దీంతో ప్రాజెక్టు నిర్మించి నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా ఎలాంటి ఫలితం లేదని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు మోటార్ల కరెంటు బిల్లు భారీగా పెరిగింది. రూ.20 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాలను గుర్తించిన ఇరిగేషన్ శాఖ ఈసారి ఎత్తిపోతలపై పునరాలోచనలో పడింది.

నీటమునిగిన మోటార్లు..
కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ఇటీవల వచ్చిన భారీ వరదలకు మునిగిపోయాయి. లక్ష్మి, సరస్వతి, పార్వతి బ్యారేజీల్లోని భారీ మోటార్లను ఇటీవలి వరద ముంచేసింది. ప్రకృతికి విరుద్ధంగా, గోదావరి సహజ పారుదలకు వ్యతిరేకంగా నీటిని ఎత్తిపోసేందుకు చేపట్టిన ప్రాజెక్టుపై నిర్మాణ సమయం నుంచే చాలా మంది అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. ఏదో ప్రళయం తప్పదని హెచ్చరించారు. ఊహించినట్లుగానే నదిని మళ్లించడం ద్వారా పెద్ద ముప్పే జరిగింది. మోటార్లను గోదావరి ముంచేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసిందన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. మోటార్లు మునగడం ద్వారా భారీగా నష్టం జరిగిందని ప్రచారం జరుగుతన్నా.. అధికారులు మాత్రం ఇదంతా మామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నష్టం ఏమేరకు జరిగిందన్నది మాత్రం ప్రకటించడం లేదు. గోప్యత పాటిస్తున్నారు. పంపు హౌస్‌ల గోడలు కూడా దెబ్బతిన్నట్లు ప్రచారం జరుగుతోంది.

జాతీయ హోదా ఆశలు గల్లంతు
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎప్పటికైనా జాతీయ హోదా వస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఇన్నాళ్లూ భావిస్తూ వస్తోంది. ఈమేరకు కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రానికి లేఖ కూడా రాశారు. కానీ తాజాగా కేంద్రం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చేందుకు అర్హత లేదని ప్రకటించింది. ప్రాజెక్టుకు ఫైనాన్స్ క్లియరెన్స్ లేనందున జాతీయ హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది.
నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం..
పార్లమెంటు సాక్షిగా కేంద్రం చేసిన ప్రకటనపై టీఆర్‌ఎస్ నాయకులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ, ఇంజినీరింగ్ అధికారులుగానీ నోరు మెదపడం లేదు. కేంద్రం కావాలనే జాతీయ హోదా ఇవ్వడం లేదని ఇన్నాళ్లూ గగ్గోలు పెట్టిన గులాబీ నాయకులు తాజాగా కేంద్రం చేసిన ప్రకటనపై ఎవరూ నోరు మెదపడం లేదు. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరికి వచ్చిన వరదలతో ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఇక జాతీయ హోదా ఇవ్వడం సాధ్యమయ్యే అవకాశం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. దీంతో ప్రాజెక్టు కథ కంచికే అన్న ప్రచారం జరుగుతోంది.
[…] […]