https://oktelugu.com/

మేం భారతీయులమే.. నేపాల్ కు కాలాపాణి ప్రజల షాక్

చైనా అండతో రెచ్చిపోతున్న నేపాల్ కు గట్టి బుద్ది చెప్పారు కాలాపాణి ప్రజలు.. కొద్దిరోజులుగా భారత్ లోని కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా అనే ప్రాంతాలు తమవే అంటూ నేపాల్ దేశం పేచీ పెడుతోంది. ఆ మూడు ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమని భారత్ వాదిస్తోంది. నేపాల్ తాజాగా భారత్ లోని భూభాగాలను తన కొత్త మ్యాప్ లో తమదేశానికి చెందినవిగా చూపించింది. ఈ మూడు ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రం కిందకు వస్తాయని భారత్ వాదిస్తోంది. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 04:13 PM IST

    kalapani

    Follow us on

    చైనా అండతో రెచ్చిపోతున్న నేపాల్ కు గట్టి బుద్ది చెప్పారు కాలాపాణి ప్రజలు.. కొద్దిరోజులుగా భారత్ లోని కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా అనే ప్రాంతాలు తమవే అంటూ నేపాల్ దేశం పేచీ పెడుతోంది. ఆ మూడు ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమని భారత్ వాదిస్తోంది. నేపాల్ తాజాగా భారత్ లోని భూభాగాలను తన కొత్త మ్యాప్ లో తమదేశానికి చెందినవిగా చూపించింది. ఈ మూడు ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రం కిందకు వస్తాయని భారత్ వాదిస్తోంది.

    Also Read: క్షమాపణ కోరిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

    భారత వాదనను పెడచెవిన పెట్టిన నేపాల్ తాజాగా ఆ దేశ రాజ్యాంగంలోని షెడ్యూల్ 3ని సవరిస్తూ కొత్త మ్యాప్ పై తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపింది. దేశ చిహ్నంలో కూడా కొన్ని మార్పులు చేసింది. నేపాల్ ప్రధాన ప్రతిపక్షాలైన నేపాలి కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాపార్టీ నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు ఆమోదం తెలుపడం విశేషం. మొత్తం 275మంది సభ్యులన్న నేపాల్ పార్లమెంట్ లో మూడింట రెండో వంతు మెజార్టీ అవసరం కాగా.. ప్రభుత్వం సునాయసంగా గెలిచింది.

    చైనా ప్రోద్బలంతో చెలరేగి పోయిన నేపాల్ కొద్దిరోజుల క్రితం భారత్ లోని భూభాగాలను కలుపుతూ కొత్త దేశ మ్యాప్ కు ఆమోదముద్ర వేసింది. దీంతో భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం రాజుకుంది.

    Also Read: స్పుత్నిక్-వి ని ప్రజలకు అందిస్తున్న రష్యా

    అయితే తాజాగా ఆ మూడు ప్రాంతాల్లో జనాభా లెక్కలు చేపట్టాలని నేపాల్ ప్రభుత్వం భావించగా అక్కడి ప్రజలు షాకిచ్చారు. కాలాపాణి ప్రాంతంలో అయితే తాము భారతీయులమని.. తమ ప్రాంతంలోకి జనాభా లెక్కలు చేయడానికి అధికారులు వస్తే తరిమేస్తామని హెచ్చరించారు. దీంతో నేపాల్ అధికారులు వెనక్కి తగ్గారు.