KA Paul: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పెదవి విరిచారు. వరంగల్ లో జరిగిన కాంగ్రెస్ సభ కోసం అంత డబ్బు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏదో కొత్త పార్టీ పెట్టినట్లుగా సభ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు దక్కించుకున్న సోనియా, రాహుల్ ప్రజల కోసం ఏం చేశారు.? 2005లో మహానాడుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తే అమ్మో అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నారు? రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెబుతున్నా నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలుస్తోంది.
కొత్తగా వాగ్దానాలు చేస్తున్న ఎవరు విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీ సభలతో ప్రయోజనం పొందాలని చూస్తోంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరోమారు చిత్తుగా ఓడించడం ఖాయమే. కాంగ్రెస్ పార్టీయే తన ప్రజా శాంతి పార్టీని లేకుండా చేసింది. కాంగ్రెస్ లో చాలా మంది నాతో టచ్ లో ఉన్నారు. ఇప్పటికి చాలా మంది కాంగ్రెస్ నేతలు నాతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే. అందుకే ప్రజలు తిరస్కరిస్తున్నారు.
Also Read: Hari Teja: ఆ డైరెక్టర్ పై నాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ – హరితేజ
సోనియా, రాహుల్, ప్రియాంగ గాంధీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమే. ఎంత ప్రయత్నించినా ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించడం ఓ కలే అనుకోవాలి. ఇదే సందర్భంలో కేసీఆర్, కేటీఆర్ లు కూడా విజయం సాధించే పరిస్థితి లేదు. దీంతో కేఏ పాల్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కేసీఆర్, జగన్ లకు చాలెంజ్ విసిరారు. ఆరు నెలల్లో అప్పుల నుంచి విముక్తి కలిగిస్తానని చెబుతున్నారు. రెండు రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా లక్షల కోట్లు అప్పులు పెరుగుతున్నాయి. తనకు ఓ సారి అవకాశమిస్తే తన సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. మొత్తానికి కేఏ పాల్ రాజకీయాల్లో మరో సంచలనం అవుతున్నారు.
Also Read:Pawan TDP : ఏపీలో పొత్తులపై సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్
Recommended Video: